Wednesday , July 24 2024

సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమ్మె బాట పట్టిన కార్మికులు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

దానికనుబంధమైన సౌత్ క్యాంపస్, కామారెడ్డి జిల్లా జంగంపల్లి మరియు డిచ్పల్లి క్యాంపస్లలో 276మంది కార్మికులు సమ్మెబాట పట్టారు ఈరోజు ఈరోజు మొదటి రోజు జంగంపల్లి సౌత్ క్యాంపస్ సమ్మె చేస్తున్న కార్మికులకు సిఐటి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పనిచేస్తున్నటువంటి నాన్బి టీచింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వం వీరిని కాంట్రాక్ట్ పద్ధతిని కాకుండా ఏజెన్సీ ద్వారా నియమించినారు మొత్తం వీరిని ప్రభుత్వం పర్మిట్ చేయాలి అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేయాలి క్యాంప్ ఆఫీస్ లో 150 మంది విద్యార్థులు ఉంటే కేవలం 20 మంది కార్మిక తోటే పని చేస్తున్నారు మిగతా విభాగాలైన కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఇంకా సుమారు 25 మంది అవసరం ఉంటారు ఇందులో భాగంగా సౌత్ క్యాంపస్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రవి మాట్లాడుతూ ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఆర్ పి ఎస్ 20 వేతనం చెల్లించాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది దాన్ని పరిష్కరించాలని ఐడెంటి కార్డులు , హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని రిజిస్టర్ గారికి విన్నవించారు. మరియు మూడు నెలలుగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి మరిచారని అందుకే సమబాట పట్టామని వారు తెలిపారు. అదేవిధంగా తక్షణమే జీతాలు పెంచి అవుట్సోర్సింగ్ సిబ్బందితో పని చేస్తున్నటువంటి అందరిని రెగ్యులరైజ్ చేయాలని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో భాగంగా కామారెడ్డి జిల్లా సిఐటియు అధ్యక్షులు అయినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ యూనివర్సిటీలపై చిన్న చూపు తగ్గదని సిబ్బందికి వేతన సవరణ చేయాలని ఉద్యోగ మరియు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఇందులో ఔట్సోర్సింగ్ సిబ్బంది శ్రీకాంత్ స్వామి శ్రీమాన్ రాజు రాజేశ్వర్ మల్లేష్ సత్తయ్య సిద్ధిరాములు వేణుమాధవ్, హారిక రజిత తదితరులు పాల్గొన్నారు.
ఇట్టు..
కే చంద్రశేఖర్ సిఐటియు జిల్లా కన్వీనర్ కామారెడ్డి