కానిస్టేబుల్ అశోక్ కు ప్రోత్సాహక నగదు అందించిన సీఐ
తెలంగాణ కెరటం నారాయణపేట జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 8
…పదో తరగతి మ్యాథ్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని…ఒక సెంటర్ బదులు మరో సెంటర్ కు రావడంతో వెంటనే స్పందించిన మఖ్తల్ సీఐ సీతయ్య… ఆ విద్యార్థినిని సకాలంలో సెంటర్ కు చేర్చి… పరీక్ష రాసేందుకు సహకరించారు. వివరాల్లోకి వెళ్తే… విద్యార్థిని భవాని…పదో తరగతి మ్యాథ్స్ సప్లిమెంటరీ పరీక్ష సెంటర్ నారాయణ పేట లోని బాలికల ఉన్నత పాఠశాల కేటాయించారు. అయితే మఖ్తల్ బాలికల ఉన్నత పాఠశాల అనుకుని అక్కడకు 8.45కు చేరుకోగా అక్కడి సిబ్బంది నారాయణపేట గా గుర్తించారు. వెంటనే సీఐ సీతయ్య కు విషయం తెలుపగా… దాదాపు అరగంట మాత్రమే సమయం ఉండటంతో వెంటనే కానిస్టేబుల్ అశోక్ ను టూవీలర్ పై 30 కిలో మీటర్ల దూరంలోని నారాయణ పేట సెంటర్ వద్ద విద్యార్థినిని దింపి రావాలని పంపడంతో… అమ్మాయి సకాలంలో సెంటర్ కు చేరుకుని పరీక్ష రాసింది. దీనిపై సీఐ సీతయ్య తోపాటు కానిస్టేబుల్ అశోక్ కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినిని సకాలంలో చేర్చినందుకుగానూ కానిస్టేబుల్ అశోక్ కు 500 రూపాయల ప్రోత్సాహకంను సీఐ సీతయ్య అందజేశారు. మరోసారి సకాలంలో స్పందించి, సేవా గుణం చాటుకున్న సీఐ సీతయ్య ను స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు.