Tuesday , July 16 2024

చిరు వ్యాపారులకు రైన్ కోట్స్ అందజేత

తెలంగాణ కెరటంరాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధిజూలై : 22చిరు వ్యాపారులకు వర్షాకాలం సందర్భంగా రైన్ కోట్స్ దుస్తులను శనివారం గోదావరి అర్బన్ బ్యాంకు యాజమాన్యం అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో గోదావరి అర్బన్ బ్యాంక్ పదవ వార్షికోత్సవం సందర్భంగా చిరు వ్యాపారులకు అవసరల నిమిత్తం రైన్ కోట్స్ దుస్తులను అందజేశారు. దుస్తులు అందుకున్న చిరు వ్యాపారులు బ్యాంకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి , డైరెక్టర్లు సురభి ధర్మారావు , వనం రమేష్ , బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు….