Sunday , May 26 2024

చిత్తనూరు గ్రామం మరికల్ మండలం నారాయణపేట జిల్లా

మధ్యాహ్నం చిత్తనూర్ సర్పంచ్ భర్త రఘునాథ్ రెడ్డి ఎంపీటీసీ దేవేందర్ రెడ్డి రాజ వర్ధన్ రెడ్డి రాజు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దయాకర్ రెడ్డి ఇంకా వీళ్ళ అనుచరులు అందరు కలిసి చిత్తనూరు గ్రామంలో ఉన్నటువంటి కిరాణా షాపుల పైన మరియు నీళ్ల పైప్ లైన్ పైన లైసెన్స్ తో నడుస్తున్నటువంటి కళ్లు దుకాణం పైన అదేవిధంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ల పైన దాడి చేసి కనిపించిన ప్రతి మహిళలను హరిజనవాడలో ఉన్నటువంటి ముసలి వాళ్ళని కూడా చూడకుండా అడ్డమైన బూతులతో తిడుతూ వారిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు అదేవిధంగా వందల గ్రామాల ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్నటువంటి చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ రద్దు కావాలని నిరసనగా ఒక సంవత్సరం నుండి గ్రామపంచాయతీ దగ్గర వేసిన టెంట్ ను బ్యానర్ను ధ్వంసం చేసి పోరాటం చేస్తున్న ఉద్యమకారులను బూతులు తిట్టడం జరిగింది ఈ విషయాన్ని గమనించిన గ్రామంలోని మహిళలు రైతులు అందరూ కలిసి గ్రామ కూడలిలో వాళ్ళు ఉండడాన్ని గమనించి ఇదేనా గ్రామ పెద్దలుగా మీరు చేసే దారుణం అంటూ ప్రశ్నించగా వారు వీరిపై దాడి చేయడం జరిగింది వారి దౌర్జన్యాన్ని తట్టుకోలేక గ్రామ ప్రజలందరూ తిరగబడి వాళ్లను దేహశుద్ధి చేయడం జరిగింది రక్షకభటుల రాకతో దాదాపు మూడు గంటల వాగ్వాదం కొనసాగింది చివరిగా పోలీసులు వారిపై కేసు బుక్ చేసి FIR చేస్తామని చెప్పగా గ్రామస్తులందరూ ఆందోళన విరమించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *