Sunday , May 26 2024

పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాను పట్టుకున్న గ్రామస్తులు

తెలంగాణ కెరటం నందిపేట్ ఆగస్టు 22:


నందిపేట్ మండలం భాద్గుణ గ్రామంలో చిన్న పిల్లలకు చాక్లెట్లను ఆశ చూపించి ఎత్తుకెళ్లి ముఠాను గ్రామ
గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. గ్రామంలోకి వచ్చిన మారువేషంలో ఉన్న మగ యువకులు అనుమానాస్పదంగా గ్రామంలో పర్యటించడంతో గ్రామస్తులు రెక్కీ నిర్వహించడం జరిగింది .వారి కదలికలను పసిగట్టి చిన్న పిల్లలకు చాక్లెట్లు ఆశ చూపించి ఎత్తుకుల్లే ముఠాగా గుర్తించి దేహ శుద్ధి చేయడం జరిగింది .ఇలాంటి ముఠాలు బద్గుణ గ్రామంలో సంచరించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు అప్రమత్తమవడమే కాకుండా భయం దోనలకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్త తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.