Sunday , May 26 2024

గణ్యాతండాలో ‘త్రాగునీటి గోషలు’

  • ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలంటున్న తండావాసులు..
  • నేనేం చేయాలి అని దురుసుగా మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి బాల్ రెడ్డి..
  • వాటర్ ట్యాంకర్ తో దాహం తీరుస్తున్న కార్యదర్శి నిర్మల..
  • పది రోజులుగా తండాలో నీటి గోషలు

తెలంగాణ కెరటం చిలిపిచేడ్ ఏప్రిల్:11

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం తాగునీటి అవస్థలు రోజురోజుకీ పెరుగుతున్న వైనం వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రత్యేక అధికారులు అనుక్షణం గ్రామాలలో ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన మాకేం సంబంధం అన్నట్లుగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. మండలంలోని స్థానిక అధికారులు పది రోజులుగా ఒక గ్రామ పంచాయతీ గా మారిన రెండు తాండాలకు త్రాగునీరు రావడం లేదని మొరపెట్టుకుంటున్న పట్టించుకునే నాథులే లేరని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పది రోజులుగా తండాలో నీరులేక పంట పొలాలు దగ్గర నుండి నీరు తెచ్చుకునే దుస్థితి ఏర్పడిందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల సమస్యలు తీర్చడానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శి నిర్మల ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్ తో రోజుకి రెండు తండాలకి నాలుగు దఫాలుగా నీరును అందిస్తున్న సమయానికి నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు.సర్పంచుల కాలపరిమితి ముగియడంతో ఎవరికి తమ పరిస్థితి తెలుపుకోవాలి అర్థం కావట్లేదని తాండావాసులు వాపోతున్నారు గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించిన కానీ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోగా త్రాగునీరు రాకపోతే నన్నేం చేయమంటారు అంటూ స్థానిక పంచాయతీ ప్రత్యేక అధికారి బాల్ రెడ్డి మాట్లాడడం గమనార్హం.అసలు ప్రత్యేక అధికారి మొఖం కూడా తమకి తెలియదని మాకు త్రాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలని వారి దాహార్తిని తీర్చాలని తండావాసులు వేడుకుంటున్నారు.

  • గణ్యాతండా ప్రత్యేక అధికారి బాల్ రెడ్డి వివరణ:

గణ్యాతండా ప్రత్యేక అధికారి బాల్ రెడ్డిని కెరటం ప్రతినిధి వివరణ కోరగా నన్నేం చేయమంటావు నేను రోజు వెళ్లి వాడవాడను తిరగలేను నాకు నా నా శాఖపరమైన బాధ్యతలు ఉన్నాయి ప్రత్యేక అధికారి అనేది ఒక ప్రత్యేక బాధ్యత మాత్రమే ప్రతిరోజు కార్యదర్శి తో మాట్లాడుతున్నాను మాజీ సర్పంచ్ కి నేను తెలుసు అందరికి తెలవాలని లేదు చేసేది చేస్తున్న త్రాగునీరు రాకపోతే నాకేం సంబంధం కార్యదర్శికి అడుగు అని దురుసుగా మాట్లాడడం గమనార్హం.

  • జూనియర్ కార్యదర్శి నిర్మల వివరణ:
    తండాకి గత వారం రోజులుగా మిషన్ భగీరథ కి సంబంధించిన నీరు రావడంలేదని తాండ ట్యాంక్ పై భాగంలో ఉండడంతో వాటర్ ఎక్కడం లేదని వాటర్ మేం చెప్తున్నారు కాబట్టి తండావాసుల దాహార్తి తీర్చడం కోసం టాంకర్ తో రోజుకి రెండుసార్లు గన్యతాండాలు రెండుసార్లు మలక్ చేరుతాండాలో ప్రతి ఇంటికి నీరు పోయిస్తున్నాం కానీ టాంకర్ కు చెందిన ట్రాక్టర్ ఇంజన్ బ్యాటరీ ప్రాబ్లం వలన ఒక్కరోజు పూర్తిగా అందలేదని అయినప్పటికీ తాండాలలో ఉన్నటువంటి నాలుగు సింగల్ ఫేస్ మోటార్లలో ఒకటి పూర్తిగా పోవడంతో ఆగిపోయిందని మిగతా మూడు ఆపుతో పోస్తున్నాయని వాటిపై కూడా త్వరలో చర్యలు తీసుకొని అందరికీ నేను అందేలా చూస్తామని తెలిపారు
    కానీ తండావాసులు వారికి శాశ్వత పరిష్కారం కావాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీటి ఎద్దడి లేకుండే ప్రతి ఇంటికి నల్లాల నీళ్లు వచ్చేవని ఇప్పుడు అదే విధంగా రావాలని కోరుకుంటున్నారు.