Tuesday , July 16 2024

సమగ్ర కుల గణన చారిత్రాత్మక నిర్ణయం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు, జడ్పీ ఫ్లోర్ లీడర్
గీకురు రవీందర్

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి ఫిబ్రవరి 17

అసెంబ్లీలో సమగ్ర కుల గణన తీర్మానం ఆమోదడం పొందడం పట్ల హర్షం వెలిబుచ్చుతూ మండల కేంద్రములో బాణా సంచా పేల్చి, స్వీట్లు పంచిపెట్టారు. బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రామోజు రాజు కుమార్ ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమములో రాష్ట్ర ఉపాద్యక్షుడు, జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడం ఆమోదం పొందడం, అందుకు 150కోట్లు కేటాయించడం పట్ల బీసీ సంఘాలు సర్వత్రా హర్షం వెలిబుచ్చుతున్నారన్నారు. ఎన్నికల హామీలో రాహుల్ గాంధీ ప్రకటన మేరకు ముఖ్య మంత్రి కేబినెట్ లో చర్చించడం, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం హర్షణీయం. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వము బీసీల అభివృద్ధిని మరిచి బహుజనులను ఓటు బ్యాంక్ గానే గుర్తింఛాయన్నారు. స్థానిక సంస్థల్లో 35శాతమున్న రిజర్వేషన్లు 25 శాతానికి తగ్గించి తీరని ద్రోహం చేసిందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి రిపోర్ట్ ను మూలన పడేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయముతో బీసీలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేలు చిత్తశుద్దితో నిర్వహిస్తుందనే విశ్వాసంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్, మండల యువజన కమిటీ ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్, బీసీ నాయకులు చేల్పూరి విష్ణుమాచారి, పెసరు శ్రీనివాస్, సింగాపురం బాలరాజు, కందుకూరి శ్రీనివాస్, మూసాపురి సంపత్, తాళ్లపల్లి తిరుపతి, బెజ్జంకి ఆంజనేయులు, తాళ్లపెళ్లి భాస్కర్, కుతాడి కొమురయ్య
మల్లం శ్రీనివాస్, చిమ్మెట నాగరాజు, సిరవేణి సంపత్, పోలు శ్రీనివాస్, కొమురయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.