Monday , September 16 2024

బాల్య మిత్రునికి ఆర్థిక సాయం అందజేత

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి ఏప్రిల్ 13

మిత్రుని కోసం మేమున్నామంటూ ఓ బాల్య మిత్రునికి ఆర్థిక సాయం అందించారు చిన్న నాటి బాల్య మిత్రులు. వివరాల్లోకి వెళితే చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన బోయిని శివకుమార్ (40) గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని తెలుసుకున్న రేకొండ 1996-97 పదవతరగతి బాల్యమిత్రులు శనివారం శివకుమార్ కు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తీగల ఆంజయ్య , తాట్ల తిరుపతి, తమ్మిశెట్టి రాములు, తీగల చంద్రమౌళి, చెంజర్ల తిరుపతి, కె. మధు, నాంపల్లి మురళి, మెడవేణి రమేష్,కొమ్మెర తిరుపతి రెడ్డి, పంకర్ల శ్రీనివాస్,ఎగ్గిడి శ్రీనివాస్, పడాల శ్రీనివాస్ ,మండల అనిల్, అప్పాల సదానందం ఎరుకొండ రాజు, మోర తిరుమల, అందె సరస్వతి