Wednesday , July 24 2024

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదిగౌరవంగా పదవి విరమణ పొందడం గొప్ప అదృష్టంలింగారెడ్డి పదవీ విరమణ సభలో ఎంపీపీ కొత్త వినీత రెడ్డి, జెడ్పిటిసి గీకురు రవీందర్

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మార్చి 31

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని,గౌరవంగా పదవి విరమణ పొందడం గొప్ప అదృష్టమని ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి సభ్యుడు గీకురు రవీందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం దోమ లింగారెడ్డి ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంను వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపిపి కొత్త వినీతారెడ్డి,జెడ్పిటిసి రవీందర్ లు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను ఒక ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషిచేసి పదవి విరమణ పొందడం సంతోషదగ్గ విషయం అన్నారు.పదవి విరమణ పొందిన ఉద్యోగులు సమాజసేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.35సంవత్సరాలలో ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా లింగారెడ్డి తీర్చిదిద్దారని గుర్తు చేశారు.ఉద్యోగ విరమణ పొందిన లింగారెడ్డి శకుంతల దంపతులు మాట్లాడుతూ 1988నుండి 2024వరకు మైసంపల్లి,బత్తులపెళ్లి,కొత్తపల్లి, గౌరవెల్లి,పొట్లపల్లి,గంభీరావుపేట చిగురుమామిడి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించానని తనకు సహకరించిన అందరికీ లింగారెడ్డి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం దోమ లింగారెడ్డి శకుంతల దంపతులను శాలువాలు కప్పి, మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి లింగారెడ్డి కుమారులు స్పందన్ రెడ్డి,అనురూత్ రెడ్డి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి,వాసుదేవ రెడ్డి,మారుతి రెడ్డి,నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్,చిట్టుమల్ల రవీందర్,దాసరి ప్రవీణ్ కుమార్ నేత,దూలిమిట్ట నరసింహారెడ్డి,పన్యాల నాగిరెడ్డి, పన్యాల శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యాయులు పన్యాల మధుసూదన్ రెడ్డి,దుబ్బాక బాల్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,ముద్రకోల మురళి, సిఆర్పి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.