తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మార్చి 15
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోలోజు సదాచారి, పైలట్ ముక్కెర సదానందము తో కలసి వారు అందిస్తున్న సేవలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోలోజు సదాచారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మరియు పురిటి నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళుటకై 108 కి కాల్ చేయాలని, అంబులెన్స్ లో నిష్ణాతులైన టెక్నీషియన్స్ ఉంటారని ఒకవేళ మార్గమధ్యంలో నొప్పులు అధికమైన వారు సాధారణ ప్రసవం చేయించే ట్రైనింగు కలిగి ఉన్నారని, తల్లి బిడ్డను దగ్గర్లో ఉన్న మాతా శిశు హాస్పిటల్ కి చేరుస్తామని తెలియచేయడం జరిగింది. వడదెబ్బకు గురైన బాధితుల కోసం 108 కి కాల్ చేయవచ్చని, ఏలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా పాము కాటు, గుండెపోటు, విషం త్రాగుట, పెరాలసిస్, పాముకాటు, రోడ్డు ప్రమాదం వంటి కేసులలో గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ లో బాగంగా మొదటి గంట చాలా విలువైనదని ఆ గంటలో ప్రధమ చికిత్స అందిస్తూ, అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్లటం ద్వారా పేషెంట్ జీవించే అవకాశాలు ఎక్కువ అని తెలియజేయడం జరిగింది.ఈ సీజను ఎండాకాలం కావున వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున 108 వాహనాన్ని ఉపయోగిం చుకోవాల్సిందిగా కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం గారు మాట్లాడుతూ నూతన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 14, 108 అంబులెన్సులు సేవలందిస్తున్నాయని మీరు ఏ సమయంలోనైనా అత్యవసరం ఏర్పడినప్పుడు 108 కి కాల్ చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీడీవో బాసం మధుసూదన్ గారు, గ్రామ కార్యదర్శి గడ్డం వెంకటరమణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ లక్ష్మీప్రసన్న, చిగురు మామిడి క్లస్టర్ సిడిపిఓ లు , అంగన్వాడీ కార్యకర్తలు, చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం, ఆశలు, గర్భిణీ స్ర్తీలు,పిల్లలు పాల్గొన్నారు.