Monday , July 22 2024

ఉచిత నేత్ర వైద్య శిబిరానికి అనుహ్యస్పందన2వందల మందికి కంటి పరీక్షలు,45 మంది ఆసుపత్రికి తరలింపులయన్స్ క్లబ్ సేవలను అభినందిస్తున్న గ్రామస్తులు…

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మార్చి 14

లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అలకాపురి రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో గురువారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి గ్రామస్తుల నుండి అనూహ్య స్పందన లభించింది.లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అలకాపురి అధ్యక్షుడు కాంతాల రాజిరెడ్డి,ఉపాధ్యక్షులు దేవసాని కిరణ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పురుషుల పొదుపు సంఘంలో పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ నేత్ర వైద్య శిబిరానికి నవాబుపేట గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజల సైతం పాల్గొని దాదాపు 2వందల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. రేకుర్తి కంటి ఆసుపత్రి టెక్నీషియల్ ప్రభాకర్ రావు కంటి పరీక్షలను నిర్వహించి కంటి ఆపరేషన్ అవసరం ఉన్న దాదాపు 45మందిని ఆస్పత్రి బస్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. గ్రామ ప్రజల కోసం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కాంతాల రాజిరెడ్డి,ఉపాధ్యక్షులు దేవసాని కిరణ్ కుమార్ రెడ్డిలకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పురుషుల పొదుపు సంఘం అధ్యక్షుడు కంది వేణు,మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ కుమార్,మాజీ ఉపసర్పంచ్ మాకు శ్రీనివాస్ రెడ్డి,రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూతురు సంపత్ రెడ్డి,కాంతాల అజేందర్ రెడ్డి,పోతరవేణి రాజయ్య, పొదుపు సంఘం ఘనకుడు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి,ఆర్.ఎం.పి వైద్యుడు కిషన్,గుల్ల రాజు,ఒదయ్య యాదవ్,మంద వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.