Sunday , May 26 2024

బిఆర్ఎస్ తో పొత్తు బి ఎస్ పి అధ్యక్షుని గా స్వాగతిస్తున్నా

బి ఎస్ పి మండల పార్టీ అధ్యక్షులు చిట్టెల సతీష్ కుమార్

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మార్చి 09

దేశంలో రాజ్యాంగానికి, లౌకికత్వానికి,పొంచి ఉన్న పెనుముప్పును దృష్టిలో ఉంచుకొని బహుజన సాధకారిత, రక్షణ, భవిష్యత్తు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ ,బి ఆర్ ఎస్ పార్టీలు తెలంగాణలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ మండల అధ్యక్షుడు చిట్టెల సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మక కూటమిని అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జి మాయావతి కి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీలు తమ తమ సిద్ధాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విజయం కోసం, తమ వ్యూహాలను, మార్చుకోవడం సర్వసాధారణం అన్నారు. ఇప్పుడు ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒకచోట పొత్తులతో ఎదిగినవే దురదృష్టవశత్తు కొందరికి ఏమి కనిపించడం లేదు. అప్పుడప్పుడు మాట్లాడని వీళ్ళు కేవలం బీఎస్పీ బి ఆర్ ఎస్ కూటమి నిందించడం హాస్యస్పదం అన్నారు. ఎన్నికల్లో పట్టుమని 10 ఓట్లు రానివాళ్లు అంబేద్కర్, పూలే , కాన్సిరాం, ఫోటోలు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని, వాళ్ల కోసం పోరాటం చేయలేని పిరికిపందలకు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. చివరగా ఈ నిర్ణయం సరైనదో కాదో చరిత్రను సమాధానం చెబుతుందని వ్యాఖ్యలు చేశారు.తల్లి లాంటి బీఎస్పీ విమర్శించవద్దని దాని వెనుక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉందని గుర్తు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి అయిన పై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కొంతమంది విమర్శలు చేస్తున్న వారి నిస్సహాయతను మేము అర్థం చేసుకోగలమని చిట్టెల సతీష్ కుమార్ తెలిపారు.