Tuesday , July 16 2024

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మే 20:

భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు రేకొండ గ్రామంలో మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బిజెపి అభ్యర్థి శ్రీ బండి సంజయ్ గారికి చిగురుమామిడి మండలం అన్ని గ్రామాల కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసిన మూలంగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే చిగురుమామిడి మండలంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసిన చిగురుమామిడి మండల నాయకులు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటా లని అన్నారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంపత్ గారు మాట్లాడుతూ గుజ్జ శ్రీనివాస్ దేశం కోసం ధర్మం కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు మనకు నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ గా రావడం మన అందరి అదృష్టం వారు నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా చిగురుమామిడి మండలంలో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఏ విధంగా ఓట్లు రావాలని చెప్పి కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపీటీసీ,బిజెపి సీనియర్ నాయకులు అమరగాని ప్రదీప్ కుమార్ చిగురుమామిడి మండలానికి ఎన్నికల కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరిని సమానవ్యపరుస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో చిగురుమామిడి మండలంలో బండి సంజయ్ గారికి భారీ మెజార్టీ వచ్చే విధంగా ప్రదీప్ కుమార్ గారు పనిచేయడం మన అందరి అదృష్టం అని మాట్లాడినరు.
సమావేశానంతరం మండల కమిటీ నాయకులు అందరూ కలిసి పార్లమెంటు ఎన్నికల్లో మనకు దిశ నిర్దేశం చేసిన నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్స్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి,గుజ్జ శ్రీనివాస్ గారికి,మండల ఎన్నికల కోఆర్డినేటర్ అమరగానీ ప్రదీప్ గారికి ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, పడాల శ్రీనివాస్ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు గందె చిరంజీవి భీమర లక్ష్మణ్ జంగ శ్రీనివాస్ రెడ్డి పోలోజు వెంకటేశ్వర్లు సదా చారి కాసాని సతీష్ శ్రీమంతుల వెంకటస్వామి కలవల సంపత్ రెడ్డి దాసరి సాగర్ రెడ్డి బొమ్మగాని మధుసూదన్ కొంకటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.