Tuesday , July 16 2024

బీసీల సామాజిక, ఆర్ధిక సమానత్వం కాంగ్రెస్ తోనే సాధ్యం

కుల గణన బిల్లు పట్ల బీసీలలో హర్షాతిరేకాలు…
రాజ్యాంగాన్ని మార్చే బీజేపీని గద్దె దించుదాం…
–గీకురు రవీందర్, జెడ్పి ఫ్లోర్ లీడర్ & బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మే 05
:
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీసీ కులాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముందుగా బస్టాండ్ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వివిధ కుల సంఘాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బీసీ అవగాహన సదస్సుకు జెడ్పి ఫ్లోర్ లీడర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కులగణన బిల్లు పొందుపరచడం పట్ల యావత్తు బహుజన సమాజం హర్షం వెలిబుచ్చుతుందన్నారు. స్వాతంత్రానికి పూర్వం 1931లో జనగణన చేపట్టారని 93 సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ జనగణన చేపడతాననడం సాహసోపేతమైన చర్య అని అన్నారు. ప్రతి వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కుల గణనతో, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా దామాషా పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు 50% పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనను అమలు చేస్తామనడం బీసీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్దిని మరిచిపోయి, దేశ సంపదను అదాని అంబానీలకు దోచి పెట్టిందన్నారు. ఇచ్చిన హామీలు గ్రామీణ ఆవాస యోజన కింద పక్కా ఇళ్ల నిర్మాణం, నల్ల ధనాన్ని వెలికి తీసి జన్ ధన్ తో సామాన్యుని లక్షాధికారిని చేస్తామనడం, ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని బుటకపు హామీలిచ్చిందన్నారు. అయోధ్య రాముని అక్షంతల పేరు జెప్పి ఈ ఎన్నికల్లోమళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే సామాన్యుని బ్రతుకు అంధకారమే నన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లలను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దళిత, గిరిజన, మైనారిటీ, బడుగు వర్గాల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ యువత భవిష్యత్తుతో ఆటలాడుతుందన్నారు. కేసీఆర్ నియంత పాలనకు చరమ గీతం పాడి, ప్రజా పాలనకు తెర తీసారని, బిఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు పట్టించుకుంట లేరన్నారు. ప్రతీ బహుజన బిడ్డ తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని, చేతు గుర్తుపై ఓటేసి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ప్రచారకార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మహిళా అధ్యక్షురాలు ముంజ శిరీష, సామాజిక ఉద్యమకారుడు కొయ్యడ కొమురయ్య, నాయకులు బుర్ర శ్రీనివాస్, చెల్పూరి విష్ణుమాచారి, పూదరి వేణుగోపాల్ గౌడ్, గట్టు ప్రశాంత్, తోట సతీష్, పిల్లి తిరుపతి, బోయిని వంశీకృష్ణ, పెసరి శ్రీనివాస్, కత్తుల దేవేందర్, పోతర్ల శివాంజనేయులు, వంగ కనుకయ్య, కొలిపాక శివ తదితరులు పాల్గొన్నారు.