Monday , September 16 2024

మృతుల కుటుంబాలను పరామర్శించిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మే04

చిగురుమామిడి మండలంలో వివిధ గ్రామాల్లో మృతుల కుటుంబాలకు బీజేపీ నేత రాంగోపాల్ రెడ్డి పరామర్శించారు. మండల వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, ఇందుర్తి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పుల్లూరు రాజు మరియు రామంచ గ్రామానికి చెందిన బిజెపి మండల కార్యదర్శి కంటే శ్రీనివాస్ గార్ల కుటుంబాలలో వారి వారి కుటుంబ సభ్యులు ఇటీవల మృతి చెందగా వారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరామర్శించారు. వారి వెంట బీజేపీ ఎన్నికల కోఆర్డినేటర్ అమరాగని ప్రదీప్ కుమార్, మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్,బీజేపీ మండల ఉపాధ్యక్షులు పెందోట రఘునాథ చారి,సీతరంపూర్ బూత్ అధ్యక్షులు శ్యమకుర చంద్రశేఖర్,కందుకూరి సత్యనారాయణ,సదా మాధవ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.