Wednesday , July 24 2024

కరీంనగర్ ఎంపీ గా వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలి.

మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మే04

లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సుందరగిరి గ్రామంలో గడప గడపకు విస్తృత స్థాయి ప్రచారం చేశారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి సూచన మేరకు సుందరగిరి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనగందుల లక్ష్మణ్ తో పాటు గ్రామ నాయకులు,యువతులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ప్రజాపాలన పథకాలు ప్రజలకు వివరించారు,దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మల్లికార్జున్,గందె రాజయ్య,పత్తెం రవి,ఆవుల నారాయణ,కాంగ్రెస్ నాయకులు,యువతులు మహిళలు పాల్గొన్నారు