తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి ఏప్రిల్ 19
మండలంలోని సీతారాంపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులు అయినా కూడా రైతులకు బోనస్ ఇంకా ఇవ్వలేదని అలాగే రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలనీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు గాని హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేయాలనీ చూస్తుందని అందుకనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం వచ్చిందని రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్ దేనని అన్నారు. అనంతరం ఉపాధి కూలిల దగ్గరికి వెళ్లి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కారు గుర్తుపైన ఓటువేసి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ్య తో పాటు వైస్ ఎంపిపి బేతి రాజిరెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి కొమురయ్య సీతారాంపూర్ గ్రామశాఖ అధ్యక్షులు శ్యామకూర సంపత్ రెడ్డి నాయకులు గోగురి కృష్ణ రెడ్డి ముస్కుల కృష్ణ రెడ్డి బుద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.