Wednesday , July 24 2024

ఈనెల 22న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట…22న పోచమ్మ బోనాలు,పెద్ద ఎత్తున మహా అన్నదానం23న పెద్దమ్మ తల్లికి బోనాలు జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన ముదిరాజ్ సంఘం సభ్యులు

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి ఏప్రిల్ 19

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఈనెల 22న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జక్కుల బాబు,గౌరవ అధ్యక్షులు జక్కుల రవిలు శుక్రవారం తెలిపారు. ఈనెల 20న గణపతి పూజ, 21న గణపతి పూజ,వాస్తు పూజ,వాస్తు హోమం,వాస్తు బలి,22న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట, యంత్ర శిఖర ప్రతిష్ట,ఆలయ ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.సాయంత్రం పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం ఉంటుందన్నారు.23న మంగళవారం పెద్దమ్మతల్లికి పెద్ద ఎత్తున బోనాలను ప్రతి గడప నుండి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బాబు చెప్పారు.24న బుధవారం జాతర ఓడి బియ్యం పోసుకునుట, జాతరను పెద్ద ఎత్తున జరిపిస్తామని చెప్పారు. ఆలయాన్ని విద్యుత్ బల్బులు పూలమాలతో అందంగా ముస్తాబు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు,చలువ పందిళ్ళుతో నీడను ఏర్పాటు చేశారు.ముదిమణిక్యం గ్రామంలో 5గుంటల స్థలంలో దాదాపు 40లక్షల రూపాయలతో అన్ని అంగులతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు.ఆలయం పైన గోపురము,రతాలు చాలా అద్భుతంగా చెక్కించారు.భూమి పూజ చేసుకున్న తక్కువ సమయంలోనే ఆలయ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించిన అధ్యక్షుడు జక్కుల బాబును ముదిరాజ్ సంఘం సభ్యులు అభినందించారు.ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ముదిరాజ్ సంఘం సభ్యులు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీసర్పంచ్ జక్కుల రవీందర్,కార్యదర్శి జక్కుల మల్లేశం, స్వామి,సమ్మయ్య, వెంకటయ్య,రాజయ్య,చంద్రమౌళి, పరుశురాములు,కనుకయ్య,వెంకటేశ్వర్లు, నందు,ఆంజనేయులు,జక్కుల మహేష్,రమేష్, వెంకట్,సాయి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.