Monday , September 16 2024

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం పట్ల హర్షం–గీకురు రవీందర్, జెడ్పి ఫ్లోర్ లీడర్& మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి. తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి ఏప్రిల్ 19

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్రాల మల్లేశంను, రాష్ట్ర యువత అధ్యక్షులుగా పండుగ బాలు ముదిరాజును నియమించడం పట్ల జడ్పీ ఫ్లోర్ లీడర్, జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గీకురు రవీందర్ హర్షం వెలిబుచ్చుతు శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప గుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లాకు చెందిన ఇరువురు రాష్ట్ర స్థాయిలో పదవులు పొందడం పట్ల జిల్లా ముదిరాజ్ మహాసభ సభ్యులు పలువురు హర్షం వెలిబుచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా గుర్రాల మల్లేశం సుదీర్ఘ కాలంగా సంఘ శ్రేయస్సు కోసం పనిచేస్తూ, కరీంనగర్ లో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి విశేష కృషి చేశారు. మత్సకారుల సమస్యలు పరిస్కారం చేయుటలో ఎంతో చొరవ చూపారు. ముదిరాజు మహాసభ జిల్లా యువత అధ్యక్షునిగా పండుగ బాలు హైద్రాబాద్ వరకు పాద యాత్ర నిర్వహించి యువతలో చైతన్యం నింపారు. రాష్ట్ర స్థాయిలో సంఘం బలోపేతం అవుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. వీరిరువురి సేవలను గుర్తించి ముదిరాజు మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రాష్ట్ర యువత అధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర స్థాయిలో వీరి సేవలను వినియోగించుకొనుటకు అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు, శాసన మండలి ఉపాధ్యక్షులు బండ ప్రకాశన్నకు ధన్యవాదాలు తెలిపారు.