కాంగ్రెస్,బిఆర్ఎస్ మోసపూరిత హామీలను నమ్మవద్దన్న నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
మండలంలోని అన్ని గ్రామాల్లో గడపగడపకు జోరుగా ప్రచారం
తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి ఏప్రిల్ 15
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బిజెపి పార్టీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను మరోసారి ఎంపిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో మండల అధ్యక్షుడు పైడిపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు,నాయకులు సోమవారం గడపగడపకు జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమాల్లో బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రచారంలో పాల్గొని కార్యకర్తల్లో మరింత జోష్ నింపారు. ఈ సందర్భంగా రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం గడపగడపకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యకర్తలు నాయకులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది అన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6గ్యారంటీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.10సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజలను నిండా ముంచిందని, టిఆర్ఎస్ మాయమాటలు ఎవరు నమ్మొద్దు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్యాల మురళి మనోహర్,జిల్లా అధికార ప్రతినిధి పోన్నం శ్రీనివాస్, పోలోజు సంతోష్ ఓబీసీ మర్చ మండల అధ్యక్షులు గర్దాస్ సతీష్, బిజెపి మండల మాజీ అధ్యక్షులు పైడిపల్లి అంజయ్య,అచ్ఛ రవీందర్, ముంజ చంద్రయ్య, మండల ఉపాధ్యక్షులు కంది శంకర్ పటేల్,రఘునాథ చారి,పడాల శ్రీనివాస్,బూత్ అధ్యక్షులు, మాడిశెట్టి కిరణ్,గూళ్ళ సంపత్, చామకూర చంద్రశేఖర్ రెడ్డి, మామిడి రమేష్,ఆరేళ్ల శ్రీనివాస్, నీల సునీల్,నెదునూరి సంపత్, బుర్ర సతీష్,దొంత కర్ణకర్,గందె చిరంజీవి,మాజీ ఎంపిటిసి పైడిపల్లి మల్లేశం,నర్రా చంద్రారెడ్డి,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి వడియాల రవీందర్ రెడ్డి,గూళ్ల స్వామి,మాడిశెట్టి స్వామి, రాగుల రవీందర్, పొన్నం శ్రీకాంత్,పత్తము మొగిలి తదితరులు పాల్గొన్నారు.