Wednesday , September 18 2024

బిజెపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పొన్నం శ్రీనివాస్ నియామకం..

పొన్నం శ్రీనివాస్ ను అభినందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి ఏప్రిల్ 13

చిగురుమామిడి:భారతీయ జనత పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన పార్టీ సీనియార్ నాయకులు పొన్నం శ్రీనివాస్ ను నియామిస్తూ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణరెడ్డి శనివారం నియామక పత్రం అందజేశారు.నియామాకం పత్రం అందజేసిన అనంతరం బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
కుమార్ శ్రీనివాస్ ను అభినందించారు.పార్టీ ఆభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేయాలని,రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఆత్యధిక మోజార్టీతో తనను గెలిపించాలని వారికి పిలుపునిచ్చారు.తన నియామాకానికి కృషి చేసిన పార్టీ శ్రేణులందరికి శ్రీనివాస్ ధన్యావాదాలు తెలిపారు.పార్టీ అభివృద్దికి, బండి సంజయ్ కుమార్ గెలుపుకోసం నిరంతరం సైనికుడీలా పని చేస్తానని పొన్నం శ్రీనివాస్ చెప్పారు.బిజెపి పార్టీలో చురుకుగా పనిచేస్తున్న పొన్నం శ్రీనివాస్ ను జిల్లా ఆధికారప్రతినిధిగా నియామించటం పట్ల పలువురు పార్టీ నాయకులు, కర్యకర్తలు, శ్రీనివాస్ భిమానులు హర్షం వ్యక్తం చేస్తు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.