Sunday , May 26 2024

ఛలో కోరుట్ల పద్మశాలీల రాజకీయ యుద్ధభేరి వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

తెలంగాణ కెరటం ఆర్మూర్ ఆగస్టు 06:

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ లో నూతనంగా నిర్మించుకుంటున్న కళ్యాణ మండపంలో ఛలో కోరుట్ల అనే అంశంపై సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆర్మూర్ పద్మశాలి మండలాధ్యక్షులు బొడ్డు గంగాధర్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజ్జు దత్తాద్రి,విశిష్ట అతిథులుగా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ ,గుజ్జేటి రాము,ఆలూర్ నూతన మండల అధ్యక్షులు చిల్క జ్ఞానేశ్వర్ ,ప్రత్యేక ఆహ్వానితులుగా గోసికొండ అశోక్ ,ఆర్మూర్ మండల కార్యవర్గ కార్య నిర్వహక ప్రతినిధులు మండల ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్ , కోశాధికారి చిట్ల యజ్ఞేశ్ పాల్గొని,ఛలో కోరుట్ల కార్యక్రమానికి రెండు మండలాలలోని ప్రతీ గ్రామం నుండి పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ముఖ్యఅతిథి బిజ్జు దత్తాద్రి మాట్లాడుతూ సంఘటితం, అధికారం, సమానత్వం, రాజ్యాధికార సాధన కోసం ఛలో కోరుట్ల ఈ నెల 13వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి కార్యక్రమంలో పాల్గొని,పద్మశాలీల సత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో బీసీ లలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు గుర్తింపు,గౌరవం,సమన్యాయం కావాలని,పద్మశాలీల అస్తిత్వం కోసం, వస్త్రోత్పత్తి రంగంలో పద్మశాలీల సృజనాత్మకతకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సామాజికంగా,ఆర్థికంగా, సాంస్కృతికంగా సాహిత్య రంగంలో పద్మశాలీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, రాజకీయ శూన్యతను అధిగమించడానికి ఐక్యతతో ముందడుగు వేయాలని,ఈ కార్యక్రమంలో హలో పద్మశాలి ఛలో కోరుట్ల అనే ఏకవాక్య తీర్మానం చేశారు.