Saturday , October 12 2024

చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  పుస్తేమట్టెలు అందజేత

తెలంగాణ కెరటం  గజ్వేల్ నియోజకవర్గం :07 మే 2023

చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50వ కార్యక్రమంగాను గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన తడకపల్లి రమ- శ్రీనివాస్ ల కుమార్తె లావణ్య వివాహానికి చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  పుస్తేమట్టెలు  మరియు ఒక చీరను అందజేసీ నూతన వధువును ఆశీర్వ దించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్, ఉపాధ్యక్షులు కొండాపురం యాదగిరి, జనరల్ సెక్రెటరీ మంగిలిపల్లి కిరణ్ కుమార్, కోశాధికారి దొంతుల ఆనంద్ మరియు సభ్యులు గుంటుకు శ్రీనివాస్, పిట్ల ఆంజనేయులు, టెంట్ నర్సింలు, తంగలపల్లి భగవంత్, యాట.అంజనేయులు, పెద్దూరి శ్రీనివాస్, భువనగిరి రవీందర్, తూo దేవేందర్, కొలిశాల ఉప్పలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు