Monday , September 16 2024

చేగుంట మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్….

తెలంగాణ కెరటం
చేగుంట మండల ప్రతినిధి ఏప్రిల్
08

చేగుంట మండల ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్.తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం చేగుంట మండల ప్రజలకు (శ్రీ క్రోధినామ సంవత్సరం) ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ తెలిపారు.ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనం -తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం అన్ని చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ అన్నారు.సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను,కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారని చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ తెలిపారు.ఈ పచ్చడి కొరకు చెరకు,అరటిపళ్ళు, మామిడికాయలు,వేపపువ్వు, చింతపండు,జామకాయలు,బెల్లం మొదలైనవి వాడుతుంటారని చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్పేర్కొన్నారు.ఈ రోజున వేపపువ్వు పచ్చడి,పంచాంగ శ్రవణం, మిత్రదర్శనము,ఆర్య పూజనము,గోపూజ,ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారని చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ సూచించారు.