Monday , September 16 2024

చట్టం ఎవరికీ చుట్టం కాదు…..చట్టం గుర్తొస్తుందా… సామాన్యులకు వర్తిస్తుందా..

చట్టం ఎవరికీ చుట్టం కాదు…..
చట్టం గుర్తొస్తుందా… సామాన్యులకు వర్తిస్తుందా..!?

కవిత అరెస్టు వదంతులు నమ్మి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేయడం సమంజసమేనా!!

అమాయక మహిళలపై అత్యాచారం జరుగుతుంటే స్పందించని మహిళా కమిషన్!!

వెంక గారి భూమయ్య… సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ

భారతదేశంలో సామాన్య మహిళలు అనేక సమస్యలతో, అనేక కేసులను ఎదుర్కొంటు పోలీస్ స్టేషన్ లో నేరుగా విచారణ జరిపిన సందర్భాలు మరిచిపోదామా…. వారు నేరస్తులేనా.. కాదా..? నేరం చేసిన నేరం చేయలేకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే మహిళలను ఇంట్లోనే విచారించాలని చట్టం చెప్తుందని, నేను విచారణకు హాజరు కాలేనని.. మానసికంగా ఇబ్బందికరంగా గురి పెడుతున్నారని, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని …నేను ఎలాంటి తప్పిదం చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా ప్రజాప్రతినిధి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్లను పరిశీలిస్తే…?? 24 తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పు ఎలా ఇవ్వనున్నారు.. అనేది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వారు సవాలక్ష సాకులు చెబుతూ సామాన్యులు చేస్తే తప్పు, ప్రజా ప్రతినిధులు చేస్తే.. ఒప్పు?? మీకు ఓ న్యాయమా …? సామాన్యులకు ఓ న్యాయమా..? ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు పిలవడం న్యాయమా…అన్యాయమా..?? ఎందుకు వేధిస్తున్నట్లు… దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సామాన్యులకు ఏ రకంగా విచారిస్తారో ప్రజా ప్రతినిధులకు అదే రకంగా విచారణ చేపట్టాల్సిందే. మీరు తప్పు చేయలేదు.విచారణ జరపండి అని ప్రజాప్రతినిధిగా ధైర్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ… మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 50 (2 )50 (3) ప్రకారం అలాంటి నిబంధనలు లేవని పిటిషన్ లో పేర్కొనడం సహజమే కానీ చట్టం అందరికీ సమానమే కదా హాజరైతే నష్టమేంటి..!! మహిళా ప్రతినిధి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ రేపు సామాన్య మహిళలు కూడా ఇదే రకంగా సుప్రీంకోర్టులో నన్ను కూడా మా ఇంట్లోనే విచారించాలని పిటిషన్లు వేస్తే రేపటి పరిస్థితి ఏంటి.? దేశంలోని ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వ హక్కు కల్పించింది. మన రాజ్యాంగం… దానిని దుర్వినియోగం చేయకుండా చట్టానికి లోబడి నడుచుకున్నట్లయితే..! చట్టం తన పని తాను చేసుకుంటుందేమో..!! ఇప్పటివరకు తనపై ఎలాంటి కేసులు లేవని కొద్దిమంది ఇచ్చిన స్టేట్మెంట్లు ఆధారంగా తనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తుందని ఈడి పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం..!!? స్వతంత్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడి. సిబిఐ తన పని తాను చేసుకుంటూ పోతుంటే రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయడం, తప్పించుకొని తిరగడం రాజకీయ నాయకులకు సాధారణంగా అలవాటైపోయింది. చేసిన తప్పులను ఒప్పుకోలేక అధికారంలో ఉన్న పార్టీలపై రాజకీయ దురుద్దేశంతో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటున్నారని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేసులను పక్కదారి పట్టించేందుకు కుట్ర జరుగుతుంది. వారం రోజుల ముందు నోటీసులు జారీ చేసి విచారించడం అభ్యంతరం తెలపడం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే కదా..?? అవమాన పరచడమే కాదా..!! ప్రజా ప్రతినిధి అయినప్పటికీ మీపై వచ్చిన అభియోగాలను తొలగించుకునేందుకే విచారణకు పిలవడం జరుగుతుంది. ఇది మనం గమనించాల్సింది.. విచారణ చేపట్టినంత మాత్రాన నిన్ను నేరం అంగీకరించమని చెప్పడం కాదు కదా…!! నేను ఏ నేరం చేయలేదు అనే నమ్మకం మీకు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి..!? సి ఆర్ పి సి సెక్షన్ 160 ప్రకారం మహిళలను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయనికి పిలవడం పై అభ్యంతరం వ్యక్తం చేయడం అంటే నేరం అంగీకరించడమే కదా..?? మీరు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు రాజకీయ పార్టీ నాయకులు విమర్శ చేస్తూ ఆరోపణ చేస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీపై మరో రాజకీయ పార్టీ విమర్శలు చేయడం సహజమే..ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను తప్పు చేయలేదు అనే ధీమాగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలకు పని కల్పించేలా మనమే తయారు చేసుకోవడం రేపటి సమాజానికి ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం. ప్రజా ప్రతినిధులకైనా సామాన్యులకైన వచ్చిన అభియోగాలను మనం దర్యాప్తు చేయించుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో అనేక ఒడిదుడుకులను అధిగమించి మరో ఝాన్సీ భాయ్ అవతారం ఎత్తే అవకాశం దొరుకుతుంది. ఎన్నికల వేళ అనేక ఎత్తుగడ్డలతో రాజకీయ పార్టీలు చేస్తున్న ఎత్తులు చిత్తులను ప్రజలు గమనిస్తుంటారు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు జవాబుదారీగా పని చేయాల్సిందే.. ఎదుటివారికి ఇంకొక అవకాశం ఇవ్వకుండా నేరుగా నన్ను విచారించండి తప్పు చేస్తే శిక్షించండి అనే విధంగానే ఉండాలి. ఇప్పటివరకు తప్పు చేసిన వారు రాజ్యాంగానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న సందర్భాలను మనం గమనిస్తున్నాం. దురుద్దేశంతో అధికారంలో ఉన్న పార్టీల నాయకులు ప్రజాధనాన్ని వృధా చేసే విధంగా ఆరోపణలు చేయిస్తూ,కుట్రలు కుతంత్రాలు నేరుగా ఎదుర్కోలేక రాజకీయ కక్ష తీర్చుకున్న పెత్తందారీ కలాలు కూడా లేకపోలేదు.కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం కలగకుండా చట్టానికి లోబడి మనపై వచ్చిన అభియోగాలను తొలగించుకునేందుకే విచారణకు స్వీకరించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చెయ్యాలి.

కవిత అరెస్టు వదంతులను నమ్మి మంత్రులు ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసం..??

ఢిల్లీ లిక్కర్ స్కాం లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడి అరెస్ట్ చేస్తుందని, అక్రమం, కుట్ర అంటూ టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. ఏ తప్పు చేయనప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి ఇంట్లోనే విచారించాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని, పిటిషన్ లో కవిత పేర్కొనడం,ఉద్దేశపూర్వకంగానే ఈడి నా వ్యక్తిగత సమాచారాన్ని లిక్ చేస్తుందని ఆరోపించడం, దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు ఆందోళన చేయడం ప్రభుత్వంలో ఉన్నారా లేక ప్రతిపక్షంలో ఉన్నారా..!! ప్రజలే ప్రశ్నించుకునే విధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యవహారం..

అమాయక మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే స్పందించని మహిళా కమిషన్..!!?

రాష్ట్రంలో అమాయక మహిళలపై అత్యాచారాలు మానభంగం జరిగినా స్పందించని మహిళా కమిషనర్.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బిజెపి పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది.అధికార పార్టీలో పనిచేసే మహిళలకు మాత్రమే మహిళా కమిషన్ పనిచేస్తుందా అనే ప్రశ్నలు సంధిస్తున్నాయి. సామాన్య మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన, ఎన్ని ఘోరాలు జరిగిన మహిళా కమిషన్ స్పందించకపోవడంపై రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా లేదా అనే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా కల్వకుంట్ల కవిత పై అరోపణలపై మహిళా కమిషన్ సుమోటాగా కేసు స్వీకరించడం విమర్శలకు తావిస్తుంది. అధికార పార్టీకి చెందిన వారికి అన్యాయం జరుగుతేనే స్పందిస్తుందా..అని విమర్శ వ్యక్తం అవుతున్నాయి. మహిళా కమిషనా లేక టిఆర్ఎస్ పార్టీ కమిషనా అని పలు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా మహిళలపై జరిగిన లైంగిక, అత్యాచార వేధింపులకు సంబంధించిన కేసులను సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయించాలని సూచిస్తున్నారు. మహిళా కమిషన్ స్పందిస్తుందా.. లేక టిఆర్ఎస్ పార్టీకి మహిళపై దాడులు జరుగుతేనే స్పందిస్తుందో వేచి చూడాలి ….వేచి చూడాల్సిందే

15 comments

  1. After going over a handful of the blog posts on your
    blog, I honestly appreciate your way of blogging.
    I added it to my bookmark webpage list and will be checking back soon.
    Take a look at my web site too and tell me how
    you feel.

  2. It is the best time to make some plans for the long run and it is time
    to be happy. I’ve learn this post and if I may
    just I wish to suggest you some interesting issues or tips.
    Perhaps you can write subsequent articles referring to this article.
    I want to read even more issues approximately it!

  3. Howdy! I could have sworn I’ve been to your blog before but after browsing through a
    few of the posts I realized it’s new to me. Nonetheless, I’m definitely delighted I found it and I’ll be book-marking it and
    checking back regularly!

  4. I know this web site presents quality dependent content and other stuff,
    is there any other website which gives such data in quality?

  5. Great looking website. Assume you did a bunch of your very own html coding. amen ohne Rezept in der Schweiz erhältlich

  6. Please let me know if you’re looking for a article writer for your weblog.
    You have some really great posts and I think I would be a good asset.
    If you ever want to take some of the load off, I’d absolutely love to write some material for your blog
    in exchange for a link back to mine. Please shoot me an email if interested.
    Thanks!

  7. Hmm it seems like your site ate my first comment (it was super long) so I guess I’ll just sum it
    up what I wrote and say, I’m thoroughly enjoying your blog.
    I too am an aspiring blog blogger but I’m still new to everything.
    Do you have any tips and hints for first-time blog writers?

    I’d genuinely appreciate it.

  8. I could not resist commenting. Exceptionally well written!

  9. An impressive share! I’ve just forwarded this onto
    a colleague who had been doing a little research on this.
    And he actually bought me dinner due to the fact that I found it for him…
    lol. So allow me to reword this…. Thanks for the meal!!
    But yeah, thanks for spending some time to talk about
    this subject here on your web site.

  10. We are a group of volunteers and starting a new scheme in our community.
    Your site offered us with valuable info to work
    on. You’ve done a formidable job and our entire community will be grateful to you.

  11. работа для курьера в мурманске двп цена за лист арзамас профиль димитровград куйбышева 6а прайс лист
    миасс автовокзал предзаводская
    ветераны нижневартовска адреса хабаровск
    улица руднева 81

  12. médicaments disponible en ligne avec des conseils d’utilisation Betapharm Tarbes medicijnen zonder voorschrift online kopen

  13. голод 1932-1933 рр. коротко, голод в Європі 1932 р.

    до чого сниться блузка та спідниця
    ворожіння на кавовій гущі тлумачення миші розклад карт у ворожінні 36 карт онлайн

  14. орыс тілінің қоғамдағы рөлі,
    менің өмірімдегі орыс тілінің рөлі эссе кунбагыска
    уксайтын кус, ерекше жұмбақтар жауабымен барыс в
    кхл, следующая игра барыс темперамент туралы қызықты мәлімет, темперамент тест қазақша

  15. өзің үшін үйренсең жамандықтан жиренсең эссе, жаманнан жирен деп неліктен
    айтқан бесікте қалай емізеді, баланы жатып емізу ауалы ажыратқыштар, ажыратқыштар реферат
    тарақаннан құтылу, таракан уы

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *