Tuesday , July 16 2024

చదువుతోనే ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఎమ్మెల్యే కందాల.

ఖమ్మం రూరల్ ,తెలంగాణ కెరటం ఫిబ్రవరి 26:

మండలంలో పోలేపల్లి గ్రామంలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా టిఎన్జీవోఎస్ కాలనీలోనే హార్వెస్ట్ స్కూల్ విద్యార్థులు యజమాన్యం ఎమ్మెల్యే కందాలు ఉపేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు .అనంతరం హార్వెస్ట్ స్ప్రింగ్ లిఫ్ స్కూల్ ఎంపీపీ బెల్లం ఉమ తో కలిసి ప్రారంభించారు .ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్ యజమాన్యం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను బోధించాలి అన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు అంతా చదువుతోనే ఉంటుందన్నారు, ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలని అన్నారు .తదనంతరం సైన్స్ ఫెయిర్ ని ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ రవి మారత్ ,ప్రిన్సిపల్ విజయ రెడ్డి ,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు ,జెడ్పిటిసి వరప్రసాద్ ,అక్కెనపల్లి వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *