తెలంగాణ కెరటం మంచిర్యాల
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
సోమవారం
మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు
ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవి సత్యం ఆర్గనైజర్ సెక్రెటరీ జైపాల్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య కో కన్వీనర్ నీరటి రాజయ్య ఈ సమావేశాన్ని ఉద్దేశించిఈ సందర్బంగా మాట్లాడుతూ నేడు ట్రేడ్ యూనియన్ రంగం విద్రోహ కారంగా మారిపోయిందని యూనియన్ నాయకులు యాజమాన్యాలకు తొత్తులుగా మారడం అలవాటయిందని యాజమాన్యంతో కుమ్మక్కై లంచాలు తిని కార్మిక పోరాటాలను నీరుగార్చి కార్మికులలో చీలుకలు తెచ్చి విద్రోహంకార ఒప్పందాలతో కార్మిక వర్గ హక్కులని యాజమాన్యం ప్రయోజనాలకు బలి పెడుతూన్నారు ముఖ్యంగా సింగరేణిలో టీబీజీకేఎస్ ఏఐటీయూసీ నాయకులు సింగరేణి యాజమాన్యనికి తొత్తులుగామారి లంచాలు తినమరిగి అక్రమాలకు పాల్పడుతూ కార్మికుల బ్రతుకులతో చెలగాటమాడుతున్నారు సింగరేణిలో రోజురోజుకు పర్మనెంట్ కార్మికులు తగ్గిపోతూ కాంటాక్ట్ కార్మికులు పెరిగిపోతున్నారు ఎంత కాలం పని చేసినా కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకుండా తక్కువ వేతనాలు ఇస్తూ ఎలాంటి ఇతర సౌకర్యాలు కల్పించకుండా సింగరేణి యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతుంది సింగరేణి సంస్థలో ఎన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం పెరిగిపోతూ వారసత్వ ఉద్యోగాల పేరిట కోట్లాది రూపాయలు కార్మికుల వద్ద నుండి దోపిడీ చేస్తున్నారు టీబీజీకేఎస్ నాయకులు కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారు 2014 ముందు సింగరేణిలో 63 వేల మంది కార్మికులు పనిచేసేవారు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో 21000 వేల కార్మికులు కుదింపబడ్డారు ప్రస్తుతానికి 42,000 వేల మంది పెర్మనెంట్ కార్మికులు విధులు నిర్వస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అవతారానికి ముందు సింగరేణిలో 15,000 వేల మంది కాంటాక్ట్ కార్మికులు పనిచేసేవారు ఈ 9 సంవత్సరాల కాలంలో 31,000 వేయి పైచిలుకు కాంట్రాక్టు క్యాజువల్ లేబర్ వివిధ సెక్షన్లలో సింగరేణి సంస్థలో పనిచేస్తున్నారు వారికి సమాన పనికి సమన వేతనం కూడా యాజమాన్యం కల్పించడం లేదు తెలంగాణ రాష్ట్రానికి ముందు సింగరేణిలో 9 ఓపెన్ కాస్ట్ గనులు 39 అండర్ గ్రౌండ్ గానులు ఉండేవి తెలంగాణ ఏర్పడిన అనంతరం 18 ఓపెన్ కాస్ట్ 22 అండర్ గ్రౌండ్ గనులు ప్రస్తుతానికి నడుస్తున్నాయి సింగరేణి సంస్థలో ఓపెన్ కాస్ట్ గనులను వేగవంతం చేస్తున్నారు ఓపెన్ కాస్ట్ గనులతో ఉత్తర తెలంగాణ గ్రామాలు వల్లకాడుగా మారుతున్నాయి సింగరేణి ప్రాంతం బొందల గడ్డగా మారిపోతున్నది నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం మూడు ఓపెన్ కాస్ట్ గనులను తీయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాబోయే కొద్ది సంవత్సరాలలో ఉత్తర తెలంగాణ బొందల గడ్డగా మారి పెద్ద విధ్వంసం జరగబోతున్నది ఇది ఇలాగే కొనసాగితే సింగరేణి ప్రాంతం కనుమరుగయ్య ప్రమాదం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీబీజీకేఎస్ నాయకులు కార్మికులకు ఇచ్చిన హామీలు మౌలికమైన సమస్యలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్లీ టీబీజీకేఎస్ నాయకులు తన ఉనికిని కాపాడుకోవడం కోసం కార్మికుల వద్దకు వస్తున్నారు కార్మిక ద్రోహులైన టీబీజీకేఎస్ నాయకులను గనుల పైన నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం
రాష్ట్ర కమిటీ తీర్మానాలు
సింగరేణి ప్రైవేట్ కరనను
1- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని ప్రవేట్కరించాలని కుట్ర చేస్తున్నారు వీరి కుట్రలను కార్మిక సంఘటితశక్తితో దింపి కొట్టాలి
2, సింగరేణి సంస్థలో ఎలాంటి దోపి లేకుండా లంచాలు లేకుండా మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న కార్మికుని మెడికల్ అన్ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగలు ఇవ్వాలి
3- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనుల ప్రైవేటీకరణను ఆపాలి సింగరేణి పబ్లిక్ రంగా సమస్తగా కొనసాగించాలి
4- కేంద్రం బొగ్గు గనులను బహిరంగ వేలం వేసే పద్ధతి ఆపి తెలంగాణలోని సింగరేణికి అప్పజెప్పాలి
4- తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణికి అప్పజెప్పాలి
5, బొగ్గు తవ్వకం పనిని కూడా సింగరేణి నిర్వహించాలి ఎట్టి పరిస్థితులలో ప్రవేట్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పరాదు
6, డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కొనసాగుతున్న మెడికల్ కుంభకోణంపై ధర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుని వారసులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి
7, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
8, బొగ్గు గనుల ప్రాంతంల్లో
సింగరేణి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలి
9, శరీరక శ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రాయితీ ఇవ్వాలి
10, ఇటివల్ల సింగరేణిలో అక్రమంగా తొలగించిన డిస్మిస్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి( 11)
2022 ,2023 , సంవత్సరం కార్మికులు తమ రక్త మాంసాలను ధారపోసి తీసుకొచ్చిన లాభాల నుండి 50% శాతం కార్మికుల పంచాలి
12, సింగరేణి కార్మికుల చిరకాల ఆకాంక్ష సొంత ఇంటి పథకం కింద హైదరాబాదు పట్టణంలో అధికారులకు ఏ విధంగానైతే 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించుల్లో సింగరేణి కార్మికుల కూడా హైదరాబాదు నగరంలో 300 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని
కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసే వరకు కొత్త లేబర్ చట్టాలు రద్దయేంతవరకు ఓపెన్ కాస్ట్ గనులను రద్దు చేసే వరకు సంఘటితగా పోరాడవలసిన అవసరం సింగరేణిలో చలామణి అవుతున్న కార్మిక సంఘాల పైన ఎంతైనా ఉందని సమస్యలను పరిష్కరించుకోవాలంటే సింగరేణిలో ఐక్య పోరాటాలు తప్ప మరో మార్గం లేదని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది
ఈ కార్యక్రమంలో
టి యస్ యు యస్, రాష్ట్ర కమిటీ నాయకులు
మిట్టపల్లి కుమారస్వామి
గోడిశెల శ్రీహరి
వెంగళ కనకయ్య
ఎం వెంకటేశం
దాసరి జనార్ధన్
కాసర్ల ప్రసాద్ రెడ్డి
పోశం చంద్రశేఖర్
ఈ శ్రీధర్ చందు పూరం సెటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు