Friday , November 15 2024

నంది వనపర్తి లోఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, నవంబర్ 10
యాచార మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం నందీశ్వరుని దర్శించుకుని నంది వనపర్తి గ్రామంలో ప్రచారం వీధి వీధిన మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. కాబట్టే మళ్లీ మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాం నన్ను ఆశీర్వదించండి అంటూ ఓటర్లను వేడుకున్నాడు.కావున మరోమారు నియోజకవర్గ ప్రజలు తానను కోరుకుంటునారు అని కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లనుకోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిన్నోళ జంగమ్మ యాదయ్య, మండల అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ బాషా,గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మూడేళ్ల గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ రజిత రాజు నాయక్, బిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ తోటి రెడ్డి రాజేందర్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పంది సుధాకర్ ,వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు