Monday , September 16 2024

బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కనబడని మాజీ ఎమ్మెల్యే.

గ్రామాలలో వెనుకబడ్డ బి ఆర్ఎస్ పార్టీ ప్రచారం. అక్కతో కలిసి పోయారా అంటున్న టిఆర్ఎస్ నాయకులు…

అధిష్టానం మక్తల్ పై ఆలోచించాలి అంటున్న క్యాడర్.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ కాంగ్రెస్లో బిజెపిలో చేరుతున్నారు. మరిముఖ్యంగా స్థానిక మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. గ్రామాలలో తిరగడం లేదని కిందిస్థాయి కార్యకర్తలతో కనీసం ప్రచారంలో కూడా కనబడడం లేదని ఆత్మకూరు అమరచింత నర్వ మండలాలలో ఏ ఒక్కరోజు పర్యటించలేదు. అడపాదడపా తప్ప ఎక్కడ గెలిపించాలని తపన కనబడడం లేదని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. మరి ముఖ్యంగా 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో గ్రామాలలో గట్టిపట్టు ఉన్న వ్యక్తిగత స్వలాభం కోసం కార్యకర్తలను వాడుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఎంపీ ఎన్నికలు ఒక్కరోజు సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అటు బిజెపి తరఫున ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కోటపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడా కనబడటం లేదు. స్థానికంగా కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరిన రాజుల ఆసి రెడ్డి తప్ప మక్తల్ నియోజకవర్గం లో ప్రచారంలో ఏ ఒక్క లీడర్ కనపడడం లేదు. ఆసిరెడ్డి గ్రామాలలో తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ గతంలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ పార్టీని ఎలాగైనా మక్తల్ మాగనూరు కృష్ణ. మండలాలలో లీడ్ ఇవ్వాలనే సంకల్పంతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా గెలుపొంది కనీసం నేడు పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఎక్కడ కూడా ప్రచారంలో విస్తృతంగా తిరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి వచ్చిన కనీస డబ్బులు ఖర్చులకు కూడా ఇవ్వడం లేదని మరికొంతమంది గ్రామస్థాయిలో కార్యకర్తలు మాట్లాడుతూ సొంత అక్క బిజెపి పార్టీ నుంచి ప్రచారంలో దూసుకుపోతుందని వారికి మద్దతుగా గ్రామస్థాయిలో రూపాయి కారి ఒప్పందంతో మద్దతిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ కాంగ్రెస్ బిజెపి మధ్య పోటా పోటీ నెలకొంది. కానీ టిఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు గ్రామస్థాయిలో మంచి పట్టు ఉంది. దీనిని టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు రోజులలో గట్టి ప్రయత్నం చేస్తే కనీసం రెండవ స్థానంలోనైనా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కార్యకర్తలు.