Tuesday , July 16 2024

బీజేపీని గద్దె దించే వరకు ఉద్యమించాలి.. ఎమ్మెల్యే

తెలంగాణ కెరటం మార్చి 3 తిరుమలగిరి సూర్యాపేట జిల్లా

పూటకోసారి గ్యాస్ ధరలను పెంచుతున్న బిజెపి పార్టీని గద్దె దించేంతవరకు ఉద్యమించాలని తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోబి అర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు బూటకపు వాగ్దా నాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని ఆయన అన్నారు ఇప్పటివరకు ఎన్నోసార్లు గ్యాస్ ధరలు పెంచడం మూలంగా నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించడానికి ప్రజలందరూ పార్టీలకతీతంగా చైతన్యం కావాలని అని పిలుపు నిచ్ఛారు తెలంగాణపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలోనూ వివక్షత చూపారని ఆయన అన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు రైతులకు రైతుబంధు దళితులకు దళిత బంధు కల్యాణ లక్ష్మి వృద్ధాప్య ఆసరా పింఛన్లను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఆయన అన్నారు బిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్ట నున్నారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమాన్ని ముందుగా తిరుమలగిరి మార్కెట్ యార్డ్ నుండి తెలంగాణ చౌరస్తా వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజనీ రాజశేఖర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్ ఎంపీపీ నెమరు గొమ్ముల స్నేహలత సురేందర్రావు. జడ్పిటిసి దుపటి అంజలి రవీందర్. వార్డు కౌన్సిలర్లు శాగంటి అనసూయ.రాములు గిలకత్తుల ప్రియలతా రాము గౌడ్, కుదురుపాక శ్రీలత రాములు కేసిడి సరళ యాదవ రెడ్డి ఫతేపురం సరిత నాగార్జున టిఆర్ఎస్ నాయకులు సంకేపల్లి నరోత్తం రెడ్డి దాచేపల్లి వెంకన్న తెడ్డు భాస్కర్ మహేశ్వరం సందీప్ నేత కందుకూరి లక్ష్మయ్య కందుకూరి ప్రవీణ్ తునికి పాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *