తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి
కామారెడ్డి నియోజకవర్గం రెడ్డిపేట గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చీరంజీవి, బీజేపీ బూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్, మరియు 30 మంది బీజేపీ సీనియర్ కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు