Thursday , May 23 2024

భూ కబ్జాకు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారి కర్ణావత్ వెంకన్న (డీఎఫ్ఓ) పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి

భూక్య శ్రీను నాయక్
కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్

తేదీ 18- 3- 2024న జిల్లా ఎస్పీ కార్యాలయంలో గిరిజన వారసత్వ భూములను కబ్జా కు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారి కర్ణావత్ వెంకన్న గారి బాగోతం గురించి ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వార్డ్ కౌన్సిలర్ భూక్య శ్రీను నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ మండలం శనిగపురం రెవెన్యూ శివారులో గల సర్వే నెంబర్ 274 లో బీసీ కాలనీలో మా తాతలకు 16 ఎకరాల భూమి 1974 వ సంవత్సరం నుండి 38/ఇ, టెనేన్స్ యాక్ట్ ద్వారా సంక్రమించిన మా తాతల వారసత్వ భూములను ఫారెస్ట్ అధికారి కర్ణావత్ ఎంకన్న (డి ఎఫ్ ఓ) తన అంగ బలంతో, అధికారుల అండదండలతోటి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, అధికారులను ప్రలోభ పెట్టి, తన అధికార బలాన్ని ఉపయోగించి మాకు ఉండబడిన వారసత్వ భూములను తన భార్య అయిన కర్ణావత్ రాదాబాయి పేరు మీద ఎ,,1: 20 గుంటల భూమిని పట్టా చేయించుకుని ఆ భూమిలో దాదాపు 20 గుంటల భూమిలో తన ఇంటి నిర్మాణాన్ని నిర్మించుకుని మిగతా భూమిని తెల్ల పేపర్లు పై గీతలు గీసుకొని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నాడు. ఆ తరువాత అదే ఎ,,1: 20 గుంటల భూమి పట్టా అందరికీ చూపించుకుంటూ దాదాపుగా మరో 2 ఎకరాల మా వారసత్వ భూమిని ప్లాట్లుగా చేసుకుని అమ్ముకుంటూ వచ్చే డబ్బులతో గతంలో రెవెన్యూ అధికారులను అటు పోలీసు అధికారులను ప్రలోభాలకు గురి చేస్తూ ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ తన అధికార బలంతో మా భూములను అక్రమంగా అన్యాయంగా కబ్జా చేసుకుంటూ అమ్ముకుంటున్నాడు. కర్ణావత్ రాధాబాయి గారికి ఏ విధంగా సర్వేనెంబర్ 274లో ఎ,,1: 20 గుంటల భూమి ఏ విధంగా సంక్రమించిందని సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా రెవిన్యూ వారు కర్ణావత్ రాధాబాయికి సంబంధించిన ఏ విధమైన ఆధారాలు కానీ లింకు డాక్యుమెంట్లు కానీ లేవని లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రెవిన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారి కర్ణావత్ వెంకన్న పై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకొని, అతనిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని కోరారు