Wednesday , July 24 2024

ఆహ్లాదకర వాతావరణంలో బోధన్జరగాలి.


జిలా కలెక్టర్ కోయ శ్రీహర్ష


తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.
జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు వాని ప్రగతిని సమీక్షీస్తూ జిల్లా కలెక్టర్ గారు దిగువ అంశాలపై శ్రద్ధ చూపాలన్నారు.

  1. ఎఫ్ ఎల్ ఎన్ అమలులో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని, వారు తప్పనిసరిగా రోజూ రెండు పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎన్ అమలు కై చేపట్టిన పద్ధతుల గురించి సవిస్తరంగా మానిటరింగ్ చేయాలన్నారు.
    ఆయా వివరాలు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ఆప్ లో నమోదు చేయాలన్నారు.

2.ఉపాధ్యాయుల కరదీపికల ఆధారంగా బోధనా చేసి వర్క్ బుక్స్ రోజూ కరెక్షన్స్ చేసి, సహాయం అవసరమున్న టీచేర్ సపోర్టు గ్రూప్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు

  1. ఇకనుండి ప్రతీ వారం ఒక మండలంలోని అందరూ ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడుతానన్నారు.
  2. ఎఫ్ ఎల్ ఎన్ అమలుకై ఆరు రాజీలేని సూత్రాలను తప్పనిసరిగా అమలుపరచాలన్నారు.

5.ఉన్నతి అమలులో కూడా ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాలన్నారు.
ఉపాధ్యాయుల డైరీ, ప్రాక్టీస్ కోసం పూర్తి సమయం ఇవ్వడం, లైబ్రరీ వినియోగం జరగాలన్నారు.

  1. ఉన్నత పాఠశాలలో నాణ్యతా ప్రమాణాల మూల్యాంకనం కొరకు ఈ వారం నుండే ప్యానెల్ ఇనస్పెక్షన్లు చేయాలని డీ ఈ ఓ ను ఆదేశించారు.
  2. పదవ తరగతి విద్యార్థులకు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు, రోజూ వారీ స్పెషల్ క్లాసులను, ప్రాక్టీసు టెస్టులు బాధ్యతగా పూర్తి సమయం నిర్వయించాలన్నారు.
  3. ఫోనిక్స్ అమలులో చాలా పాఠశాలలు మెరుగ్గా ఉన్నప్పటికీ, కొన్ని పాఠశాలల్లో మొక్కుబడిగా నిర్వహించి వదిలేశారన్నారు. ఫోనిక్స్ ద్వారా విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారని, అందుకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్లాన్ అనుగుణంగానే నేర్పాలన్నారు. వచ్చే వారంలో రెండ్రోజుల పాటు మరో మారు రిఫ్రెషర్ శిక్షణ ఇస్తామన్నారు.
  4. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల భాష సామర్థ్యాలు మెరుగయ్యేందుకి మాత్రమే లైబ్రరీ పీరియడ్ ఉపయోగపడుతుందని, అందుకు అందరూ ఉపాధ్యాయులు చొరవ తీసుకుని ప్రతీ విద్యార్థి ధారాళంగా చదివేలా శిక్షణ ఇవ్వాలని, లైబ్రరీ పకడ్బందీగా అమలుపరచాలన్నారు.
  5. ఇంకనూ చాలా పాఠశాలల్లో పుస్తకాలు, వర్క్ బుక్స్ లేకపోవడం పట్ల డీ ఈ ఓ గారు శ్రద్ధ తీసుకొని వారం రోజుల్లో అన్ని పాఠశాలల్లో అందరూ విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని, అందుకు ప్రత్యేక అధికారిని నియుక్తులను చేయలన్నారు.
  6. ఉపాధ్యాయుల సహకారంతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, అందుకు మెంటరింగ్ మానిటరింగ్ తప్పనిసరిగా స్నేహపూర్వక వాతావరణంలో నిర్వజించాలన్నారు.
  7. మండల నోడల్ అధికారలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , డీ ఆర్ పీలు తప్పనిసరిగా పాఠశాల సందర్శన చేయాలని వాని వివరాలు ఆప్ లో నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు.
  8. ఉపాధ్యాయులు తరగతివారీగా విద్యార్థుల ప్రగతిని ఆప్ లో నమోదు చేయాలన్నారు.
  9. ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలు చాలా మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి 6-10 తరగతులకు సంబంధించి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ కనబరచాలన్నారు.
  10. హెల్పేర్ టీచేర నియామకం వల్ల చాలా పాఠశాలల్లో సబ్జెక్టు కొరతను అధిగమించామని డీ ఈ ఓ అన్నారు.

ఇకమీదట ప్రతీ పక్షం రోజులకు ఒకసారి విద్యాశాఖ పై సమీక్ష నిర్వహిస్తామన్నారు.