భార్య 4 నెలల గర్భవతి అని తెలిసినా వెంటపడి మరీ నరికి చంపిన భర్త..
ఎందుకీ పని చేశావని పోలీసులు నిలదీస్తే ఏం చెప్పాడంటే..!టర్నెట్ డెస్క్: హర్యానాలోని హిసార్‌లో దారుణం జరిగింది. భార్య 4 నెలల గర్భవతి అని తెలిసినా వెంటపడి మరీ నరికి చంపాడో భర్త.ఒక నిమిషం నిడివి గల ఈ ఘటన తాలూకు వీడియో బయటకు వచ్చింది. ఇక భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకీ పని చేశావని అడిగితే.. అతడు షాకింగ్ విషయం చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిసార్‌లోని అగ్రోహా బ్లాక్‌లోని లంధాడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే రోషన్ లాల్ రాజ్ బాలాకు 2013లో వివాహమైంది. వారికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, రాజ్ బాలాకు పెళ్లయిన రెండేళ్లకే లంధాడికి పొరుగున ఉండే మరో గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్త రోషన్‌కు తెలియడంతో మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు.కానీ, రాజ్ బాలా పద్దతి మారలేదు. అశోక్‌తో తన అక్రమ సంబంధాన్ని అలానే కొనసాగిస్తూ వచ్చింది. దాంతో పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ కూడా కూడా జరిగింది. అలా పంచాయితీ జరిగిన కొన్ని రోజులు రాజ్ బాలా సైలెంట్ అయ్యేది. ఆ తర్వాత మళ్లీ మొదటికి వచ్చేది. ఈ క్రమంలో పది నెలల కింద ఆమె తన ప్రియుడు అశోక్‌తో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి మరో గ్రామంలో కాపురం కూడా పెట్టారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణీ. దాంతో బుధవారం హిసార్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్ కోసం వచ్చింది.