తీవ్రగాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లి గ్రామ శివారులో ఘటన
తెలంగాణ కేరటం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట మండలంలో రాగట్లపల్లి శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ యువతీ ద్విచక్ర వాహనంపై సిరిసిల్లకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీ కొట్టుకోగా తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల సాయి నగర్ కు చెందిన ఆకాంక్ష (20)అనే యువతి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విందులో హాజరై తిరిగి సిరిసిల్లకు వెళ్తుండగా రాగట్లపల్లి గ్రామ శివారు వద్ద నూతన బ్రిడ్జి ఈ రోడ్డుకు ఉన్న లింకు సరిగా లేకపోగా యమహా ఫెషీనో ద్విచక్ర వాహనంపై అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ కు ఢీ కొట్టుకున్నది. తలకు తీవ్ర గాయాలు కాగా స్థానిక రాగట్లపల్లి ఉపసర్పంచ్ రాజు, కొర్రి ప్రమోద్, స్థానికులు 108కు సమాచారం అందించగా వెంటనే స్పందించిన 108 ఫైలెట్ కుమారస్వామి,ఈఎంటి రాజులుసంఘటన స్థలంలో గాయాలైన యువతీని అంబులెన్స్ లో పదమ చికిత్స అందిస్తూ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో గాయాలైన యువతి స్థానిక ఎంపీడీవో చిరంజీవి దగ్గర బంధువుగా సమాచారం.