తెలంగాణ కెరటం బెజ్జంకి మండలం ఏప్రిల్ 28 :
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన రణం లింగయ్య వయసు 41 సంవత్సరాలు సెంట్రింగ్ వృత్తి చేస్తూ జీవిస్తాడు. ఈ నెల 24వ తారీఖున సెంట్రింగ్ పని నిమిత్తం బెజ్జంకి వచ్చి తిరిగి రాత్రి 10 గంటల సమయంలో తన యొక్క టీవీఎస్ ఎక్సెల్ బండి నెంబర్ TS 23 F 8254 తిరిగి వెళుతుండగా గుండారం గ్రామ శివారులో గల ఆయిల్ ఫామ్ వద్ద బండి అదుపుతప్పి కింద పడగా అతని తలకు తీవ్రమైన గాయం అయింది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. మృతునికి ఒక కుమారుడు, ఒక కూతురు కలరు. భార్య విజయ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బెజ్జంకి పోలీసులు తెలిపారు.