Wednesday , July 24 2024

నూతన ఎలక్ట్రికల్ బైక్ షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తెలంగాణ కెరటం బెజ్జంకి మండలం మే 10 :

శాస్త్ర, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మానవుడు మనుగడను సాగించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చేతుల మీదుగా ఏడిఎంఎస్ నూతన ఎలక్ట్రికల్ బైక్ షోరూం ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బైకులు వినియోగించడం ద్వారా, కాలుష్య నివారణతో పాటు, ఇంధనం ఆదా అవుతుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఈ బైక్ లను వినియోగించడానికి అందుబాటులోకి తేవడం సంతోషకరమైన విషయం అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని షోరూం యజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పులి కృష్ణ, అక్కరవేని పోచయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, మహంకాళి ప్రవీణ్, బండిపెల్లి రాజు, పులి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.