Tuesday , July 16 2024

బాసర క్షేత్రానికి వాస్తు దోషమా…?!


విద్యార్థులు మృతికి వాస్తు దోషాలు కారణమా ..?


విద్యాశాఖ మంత్రి ..జిల్లా మంత్రి మౌనం దేనికి సంకేతం..!?


ప్రైవేట్ పరం చేయడానికి సమస్యలను సృష్టిస్తున్నారా…?

బాసర క్షేత్రంలో విద్యావంతులను బుద్ధిమంతులను తీర్చిదిద్దాలన్న కాంక్షతో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి జిల్లా అదిలాబాద్ కు త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయాలని, ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.
వాస్తవానికి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా..!? త్రిబుల్ ఐటీ ఏర్పాటు నుండి దాదాపు ఇప్పటివరకు 20 మంది విద్యార్థులు మృతి చెందారు. గత రెండు సంవత్సరాల నుండి త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు తరగతులు బహిష్కరించి నెల రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అనేకమంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ చదువులను విడిచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల వైపు వెళ్లిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్న ప్రక్షాళన చేయలేరు.ఎందరో విద్యార్థులు మానసికంగా శారీరకంగా కృంగిపోయి బలవన్మరణానికి పాల్పడుతుంటే కారణమేంటి..? నిజానికి త్రిబుల్ ఐటీ వాస్తుకు అనుకూలంగా కట్టారా… వాస్తు అనుకూలించట్లేదా .. అసలు..? చాలామంది మేధావులు వాస్తు అనగానే నవ్వుతూ…జన విజ్ఞాన వేదికను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి కి వాస్తు దోషాలు ఏంటి అనేది మేధావుల ఆలోచన..! దోషాలు వాస్తవానికి ఉన్నాయా..!? లేక వాస్తు అనేది మూడ నమ్మకం..?! ఇలాంటి ఎన్నో ప్రశ్నలు విశ్లేషించిన వారిపై విమర్శలు గుప్పిస్తారు. ఎందుకు వాస్తు దోషాలు ఉన్నాయని అన్నారు. ఒకసారి చూడండి. నిజానికి ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రైస్తవుడు ఆయన వాస్తు దిశగా ప్రయాణించారా లేదా అనేది కొన్ని అనుమానాలు..!! ఇప్పుడున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాస్తు చూడంది ఎలాంటి భవనాలు నిర్మించరు. బయటకు కూడా వెళ్లడు. అలాంటి ముఖ్యమంత్రి బాసర క్షేత్రంలో త్రిబుల్ ఐటీ వైపు ఎందుకు మొగ్గు చూపడం లేదనేది లక్ష మిలియన్ల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.మానసిక వైద్యులతో విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది..
విద్యార్థులను ఎవరైనా అధికారులు వేధిస్తున్నారా … మానసికంగా కానీ శరీరకంగా గాని… విద్యార్థులు ఎందుకు చనిపోవాల్సిన అవసరం వచ్చింది. అర్ధరాత్రి వరకు విద్యార్థులు మెలుకువగా ఉండాల్సిన అవసరం ఏమిటి..? అర్ధరాత్రి కుక్కలు తరమడం ఏంటి..? బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందితే.. లేదా ఆఖరి శ్వాస ఉన్నట్లయితే.. నిర్మల్ కు నిజామాబాద్ కు ఉన్న దూరం ఎంత..? నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించాల్సిన అవసరమేంటి..? 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న నిర్మల్ బెటరా..!? 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ బెటరా.!? వీటన్నిటికీ అనేక ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇంత జరుగుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మౌనం వీడకపోవడం పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.గతంలో కలెక్టర్ గా ఉన్న ముషారఫ్ p ఆలీ 15 రోజులకు ఒకసారి త్రిబుల్ ఐటీని పరిశీలన చేసేవారు. ఇప్పుడున్న కలెక్టర్ కొత్తగా అయినప్పటికీ అవగాహన లోపం ,జిల్లా సమస్యలపై పట్టు లేకపోవడం, రాజకీయ నాయకులకు బంది అవడం.. ప్రజల సమస్యలను, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యారని చెప్పవచ్చు.. విద్యార్థులకు భోజనంలో బల్లులు, పురుగులు వస్తున్నాయని, ఇలాంటి సమస్యలు బయటకు చెబితే విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని గతంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి మొరపెట్టుకున్న సందర్భాలు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు సందర్శించి నెలకొకసారి త్రిబుల్ ఐటీ కి వస్తానని చెప్పి ఇంత జరుగుతున్న మౌనం వీడకపోవడం, జిల్లాకు చెందిన మంత్రి అల్లోల సందర్శించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యార్థుల గోస కంటే.. వారి రాజకీయ భవిష్యత్తు ముఖ్యం అనుకుంటున్నారేమో..?! ఏం చేద్దాం అనుకుంటున్నారు.. ఎందుకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయో ఏనాడైనా ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారా.!? విద్యార్థులకు రక్షణ కరువై, రాక్షసుల్లాగా తయారవుతున్న ఉన్నత అధికారులు కూడా మౌనం వీడకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఆగ్రహానికి గురి చేస్తుందని చెప్పాలి.

త్రిబుల్ ఐటీని ప్రైవేట్ పరం చేయడానికి ఇలాంటి సమస్యలను సృష్టిస్తున్నారా..?

బాసర క్షేత్రం లో ఉన్న త్రిబుల్ ఐటీ ని ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం ఈ రకమైన వేధింపులకు గురి చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కళాశాలలో సమస్యలు సృష్టించి అదుపు తప్పిందన్న పేరుతో ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం. అదే జరిగితే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి..!? ఇప్పటికే దళిత, గిరిజనులు, బహుజనుల పిల్లలు ఉన్నత విద్యకు దూరమవుతున్న వేళ, శాస్త్రీయ సంకేత విద్యా సంస్థలను ప్రైవేటుపరం చేస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలు బలి అవ్వడమే తప్ప మరో అవకాశం లేదు. రెండు సంవత్సరాల నుండి అనేక సమస్యలతో త్రిబుల్ ఐటీ నిత్యం మీడియా ప్రధాన పత్రికల్లో ప్రచారం అవుతున్న వేళ.. ప్రభుత్వం స్పందించకపోవడంపై అనేక అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.. త్రిబుల్ ఐటీ లో ఈ సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రజలు ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నారని చెప్పాలి. ప్రజల పలు రకాలుగా మాట్లాడుకోవడం .. ప్రభుత్వం స్పందించక పోవడానికి బలం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాసర క్షేత్రంలోని త్రిబుల్ ఐటీ లో నెలకొన్న సమస్యల తోపాటు వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా. తెలుసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమా రాజకీయాలపై విశ్లేషణ