Saturday , October 12 2024

బంజారా భవనం ప్రారంభోత్సవం తరువాత అటువైపు చూడని గిరిజన నాయకులు అధికారులు

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14:

కోటి 50 లక్షలతో నిర్మించిన బంజారా భవనం శిథిలావస్థ
ఆర్భాటంగా ప్రారంభించి చేతులు దులుపుకున్న అధికారులు
కంప చెట్లతో వ్యర్ధాలతో నిండి ఉన్న బంజారా భవన్
ప్రారంభోత్సవం రోజు తిన్న ఇస్తరాకులు గ్లాసులు కూడా తీయని వైనంప్రారంభం రోజు వేసిన గేటు తాళాలు నేడు ప్రారంభం
కార్యక్రమం ఉంటే తప్ప నేతలకు గుర్తుకురాని బంజారా భవన్
ప్రజాధనం వృధా అంటున్న మేధావులుసూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గంలో బంజారాలు ఎక్కువగా ఉన్నారని ఈ నియోజకవర్గంలో గిరిజనులు ఎంతో ప్రయాసపడి అప్పటి ప్రభుత్వం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంతో కోటి 50 లక్షలతో బంజారా భవనం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో రామస్వామి గుట్ట పరిసర ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఈ బంజారా భవనాన్ని 22-2- 23న శ్రీమతి సత్యవతి రాథోడ్ రాష్ట్ర గిరిజన స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ అప్పటి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మరియు గిరిజన నాయకులు అధికారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి దాదాపుగా సంవత్సరం కావస్తున్నది ఆనాటి నుండి నేటి వరకు నాయకులు కానీ గిరి పుత్రులు కానీ అటువైపు చూసిన పాపాన పోలేదు. వేసిన తాళం వేసినట్టే ఉంది ఆ క్యాంపస్ మొత్తం ముండ్ల పొదలతో వ్యర్ధాలతో ఆవరించి ఉంది. ఆ భవన బాగోగులు విధివిధానాలు ప్రకటించకుండా మూన్నాళ్ళ ముచ్చటగా దిక్కు మొక్కు లేకుండా మిగిలిపోయిందని ప్రజాధనం వృధా అయిందని గిరిజనులు వాపోతున్నారు. మరో విషయం ఏమిటంటే ప్రారంభం రోజు అక్కడ ప్రజలు అన్నం తిన్న విస్తరాకులు, గ్లాసులు ఆ వేదికలోనే ఉండటం ఎంత సిగ్గు చేటని కార్యక్రమం అయిన వెంటనే వాటిని తీసి శుభ్రం చేయకుండా అధికారులు నాయకులు ఎవరి దారిన వారు వెళుతూ తాళాలు వేసి చేతులు దులుపుకున్నారని లంబాడాల ఆరాధ్య దైవం అయిన శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ నేడు కాబట్టి ఆ భవనం గుర్తు వచ్చిందని లేకపోతే మరెన్నాళ్ళకు గుర్తొచ్చేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి బంజారా భవనాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా పరిశుభ్రంగా ఉంచి దానికి పూర్తి కమిటీ నియమించి అక్కడ ఒక అటెండర్ ను ఐన నియమించి భద్రత కల్పించాలని గిరిజన సంఘాల మేధావులు అధికారులను నాయకులను కోరుతున్నారు.