Wednesday , July 24 2024

బిచ్కుంద మండలంలో బండి సంజయ్ కు స్వాగతం పలికిన అరుణతార

తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి: నవంబర్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో బుధవారం రోజు రాష్ట్ర బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు బండి సంజయ్ జుక్కల్ నియోజకవర్గం బిజెపి పార్టీ అభ్యర్థి అరుణ తారకు మద్దతుగా రావడం జరిగింది. బండి సంజయ్ కు అరుణ తార ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.పాథలాపూర్ నుండి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన సభా ప్రాణానికి చేరుకోవడం జరిగింది. బండి సంజయ్ మాట్లాడుతూ కుమారి అరుణ తారకు భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ప్రజలకు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం బిజెపి పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.