Sunday , May 26 2024

బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్టు 25

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లోని కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ పౌండేషన్ సహకారంతో కార్పెడ్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ మండల్ కో -ఆర్డినేటర్ దుర్గమణి టీ డబ్ల్యూ ఏ యు పి యస్ బాయ్స్ హాస్టల్ కౌడిపల్లి మండలం విద్యార్థులకు చిన్నపిల్లల అక్రమ రవాణా & బడి మానేసిన పిల్లలు బాల్యవివాహాలు ,బాలకార్మికులు అనే అంశాల పైన అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులకు అర్థమయ్యే విదానంలో అపరిచితులతో అప్రమతంగా ఎలా ఉండాలనేది వివరించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారి చుట్టుపక్కల ప్రాంతాలలో గాని, వారి బంధువుల ఇళ్లలో గాని, వారి వయసు పిల్లలు చదువుకోకుండా ఇంటిదగ్గర తిరుగుతున్నట్లుగా కానీ, భిక్షాటనకు వెళుతున్నట్లు గాని, లేబర్ వర్క్ చేస్తున్నట్లుగాకానీ, తెలిసి ఉన్నట్లయితే 1098 కి కార్పెడ్ సంస్థకి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది.ఆలాగే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకు, 21 సంవత్సరాలు లోపు అబ్బాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నట్లుగా తెలిస్తే వారి తల్లిదండ్రుల సహాయంతో కార్పెడ్ సంస్థకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ యాదయ్య సార్ & వినోద్ నాయక్ స్టేట్ ప్రెసిడెంట్ (గిరిజన జన సమితి ), స్టాఫ్ నర్స్ వెన్నెల ,పీటి శేఖర్ సార్ ,పాల్గొన్నారు