Tuesday , July 16 2024

బాల్కొండ లో క్రీడా ప్రాంగణం అంశం లేని”పల్లె ప్రగతి”

బాల్కొండ లో క్రీడా ప్రాంగణం అంశం లేని
“పల్లె ప్రగతి”

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి జూన్ 17 :

నిజమాబాద్ జిల్లా బాల్కొండ నియోజీక వర్గం పైగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ఏం.ఎల్.ఏ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి రోజున క్రీడా ప్రాంగణం అంశం లేని
“పల్లె ప్రగతి”నీ నిర్వహించడం ఆశ్చర్యకరంగా ఉందని స్థానిక క్రీడాకారులు వాకర్స్ క్లబ్ వారైనా రాజు,రమేష్,సీనియర్ క్రీడాకారులు బి.అర్.నర్సింగ్ రావు,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానిక అధికారుల నిర్లక్షం వల్లనే తెలంగాణ క్రీడా ప్రాంగణ నిర్మాణం కావడం లేదని క్రీడాకారులు ఆందోళన చెందు తున్నారు.

“వివాద క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలన చేసిన విచారణ అధికారి”
తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్టత్మ కంగా ప్రవేశ పెట్టిన గ్రామీణ క్రీడాకారులకు క్రీడా ప్రాంగణాలు ప్రవేశ పెట్టడం హర్షిందగ్గ విషయం.ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూమిని తేది 07-06-2022 మరియు డిసెంబర్ 16 నుండి 17 వరకు సర్వే నెంబర్లైన 1375,1376 లో 10 ఏకరల కు పైగా ప్రభుత్వ భూమిలో నాలుగు ఏకరాలు క్రీడా ప్రాంగణానికి కేటాయిస్తూ బాల్కొండ తహసిల్దార్ వినోద్ ,జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ సమర్పిస్తునే బాల్కొండ మండల అభివృద్ధి అధికారికి ప్రభుత్వ భూమిని అధికారికంగా అందజేశారు.
కగా ఈ స్థలం నిజామాబాద్ లో
నివసిస్తున్న వారు ప్రభుత్వ భూమి కబ్జాల్లో ఉంచుకొని తెలివిగా సెకండ్ పార్టీ కి అమ్మేశారు.కొనుగోలు చేసిన సెకండ్ పార్టీ వారు ప్రభుత్వ భూముల్లో ఇల్లు లేకున్నా ఇల్లు ఉన్నట్లు 1-43/1/2/3 “బై నుంబర్లుగా” కబ్జా దారులచే మార్ఫింగ్ చేసి నకిలీ డాక్యుమెంట్ల సృష్టించి
సర్వే నెంబర్లను లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం.కాగా ఆర్మూర్ డి ఎల్ పీ ఓ శ్రీనివాసులు 18-01-2023 & 01-02-2023 రోజుల్లో క్రీడ ప్రాంగణ స్థలాన్ని ప్రభుత్వ స్థలం గానే గుర్తించాం అని01-02-2023 రోజున విలేకరులతో వివరణ ఇస్తూ
ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారం ఇంటి నంబర్ 1-43 బి.గంగాధర్ ఉండగా 1-43/1 షేక్ షజిత్,1-43/2 లో షేక్ కమ్రొద్దిన్ ఇల్లు ఉన్నాయి,కానీ బి.కుమార్, బి.కిషన్,మరియు బి.నర్సింగ్ రావు లు 1-43/1, 1-43/2, 1-43/3 ఇల్లు నంబర్ లుగా ఉన్న “ఇల్లు నంబర్లన్ని ఫేక్ ” నంబర్లనీ, గ్రామ పంచాయతీ ఇల్లు టాక్స్ రసీదులు సృష్టించి నట్లు తెలుస్తుంది.వాస్తవంగా
1-43/1 షేక్ షజిత్,1-43/2 లో షేక్ కమ్రొద్దిన్ చెందిన ఇంటి నంబర్ లు ఇల్లు ఉన్నాయి. ఇదే ఇండ్ల పై మళ్ళీ డబుల్ ఇల్లు నంబర్ ఎలా సృష్టించారో దీని వెనుక అసలు సూత్ర దారులు ఎవరో తేల్చాల్సి ఉందని విచారణ అధికారి
పత్రికలతో అన్నారు.

“అవినీతికి నిలయంగా గ్రామ పంచాయతీ “
బాల్కొండ లో గ్రామ పంచాయతీ వారు ఇస్టాను సారంగా ఇల్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు
ఒక్కో ఇంటికి 15 నుండి 25 వేలకు పైగా “ఆమ్యామ్య” వ్యవహారం జి.పి లో కరోబార్ నుండి కార్యదర్శి దాకా ఈ “ఆమ్యామ్య” వ్యవహారం బాహాటంగా నడుస్తుందనీ ప్రజలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగనం నిర్మానానికి హద్దులు గుర్తించి 20 ఫిట్ల వెడల్పు తో రోడ్డు హద్దులను గుర్తించడానికి ఆర్మూర్ డివిజనల్ అధికారి 18-01-2023 & 01-02-2023 రోజుల్లో విచారణ చేశారు పైగా ఆలయం వద్ద కొంత రోడ్డు దురాక్రమణకు చేసిన
హద్దుల్ని తీసి వేయాలని కార్యదర్శి నర్సయ్య కు ఆదేశాలు ఇచ్చిన ఎందుకు హద్దులు తొలగించ లేదొ అర్థం కావడం లేదు.రోడ్డు గురించి ఆలయానికి గ్రామ పంచాయతీ తీర్మానంతో కూడిన “నక్ష” ఉంది పైగా (2) విద్యుత్ స్థంబాలు ఉన్నాయి. ఆలయం వైపు వచ్చే రోడ్డును భూ కబ్జా దారునికి గ్రామ పంచాయతీ వారు ఎలా అనుమతులు ఇచ్చారు ? దీనికి గ్రామ పంచతి వారు సమాధానం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా మానవ
హక్కుల కౌన్సిల్(సాoక్తృతిక) అధ్యక్షులు మరియు శ్రీ నిమిషంభ దేవి ఆలయం బాధ్యులు బి.ఆర్.నర్సింగ్ రావు ప్రశ్నిస్తున్నారు.ఇది ఇలా ఉండగా మంత్రి గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ వద్ద ఆమోదం కోసం ఉన్న ఫైల్ ను సత్వరమే అనుమతిని ఇప్పించి బాల్కొండ మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిచేందుకు కృషి చెయ్యాలని బాల్కొండ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజు,సీనియర్ క్రీడాకారులు విద్యార్థులు మంత్రిని పత్రిక ప్రముఖంగా కోరుచున్నారు.