Wednesday , July 24 2024

బీఆర్ఎస్ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 18 :

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ, వార్డ్ మెంబర్లు జల్కార శంకర్, చింతకింది నరసయ్య, జక్క భోజన్న ,నేర నరసయ్య, పోల మని, గైన భూమేశ్వర్, శివలింగం, ఉదయపాల్, గంగాధర్, రమేష్, బాలయ్య, రాజేశ్వర్, జువ్వన్న, నరేష్, గంగాధర్ ఆటో యూనియన్ మున్నా అనిల్, భీమేష్ మరియు మాల సంఘం మాదిగ సంఘం ఆటో యూనియన్ యాదవ సంఘం గంగపుత్ర సంఘం చాకలి సంఘం ఆదివాసి సంఘం సభ్యులు సోమవారంరోజు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో ప్రజానీలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజల ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతుందని ప్రజా పాలనలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంతో మెలుగుతున్నారని బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. ఈ
కార్యక్రమంలో ముప్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి మోర్తాడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి ,డిసిసి ఉపాధ్యక్షుడు శివకుమార్ జక్క రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.