Monday , September 16 2024

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 14 :

నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జలంధర్ హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం కింద బాల్కొండ పోలీస్ సిబ్బంది కలిసి తమ వంతు సహాయంగా 50 వేల రూపాయల నగదు మరియు బాల్కొండ ఎస్సై కే గోపి తన వంతు సహాయంగా 28 వేల రూపాయలు నగదు అతని కుటుంబానికి ఆర్మూర్ రూరల్ సిఐపి కె శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజు ఇవ్వడం జరిగింది.