Thursday , November 7 2024

తప్పిపోయిన వ్యక్తి సమాచారం పోలీసులకు అందించండి

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 7 :

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన గంధం జలమయ్య 55 సంవత్సరాలు ఇంటి నుండి వెళ్లి తిరిగిరాలేదని, బంధువులు ఫిర్యాదు చేశారనిమోర్తాడ్ పోలీసులు తెలిపారు. తప్పిపోయిన వ్యక్తి జలమయ్య 5,9 ఎత్తు కలిగి ఉంటారని, తెల్లటి పుల్ చొక్కా ధరించాడని, గోధుమరంగు ప్యాంటు ధరించాడని, పోలీసులు తెలిపారు. తప్పిపోయిన ఇట్టి వ్యక్తి సమాచారం మోర్తాడ్ పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.