Friday , November 15 2024

ఆర్టీసీ బస్టాండ్ లో పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న లయన్స్ క్లబ్

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 3

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్పకంగా చేపట్టిన పోలియో చుక్కల కార్యక్రమం లో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వివరాల్లోకి వెళితే మోర్తాడ్ మండల కేంద్రం లోని ఆర్ టి సి బస్టాండ్ ఆవరణలో ఆదివారం పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. 5 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలలకు ఎందుకోసం పోలియో చుక్కలను వేయాలి అనే అంశం పై ప్రజలకు క్లబ్ సభ్యులు అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షులు మామిడాల మనోహర్ మాట్లాడుతూ పొలియో చుక్కలు వేయకుంటే పిల్లలు అనారోగ్యం పాలు అవుతారన్నారు. అంతేగాకుండా పోలియో చుక్కలు వేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రోగానిరోధక శక్తి పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం చైర్మన్ సామ శ్రీనివాస్ తో పాటు క్లబ్ సభ్యులు ప్రవీణ్, లింబాద్రి, పబ్బ సంజీవ్ తది తదితరులు పాల్గొన్నారు.