Wednesday , July 24 2024

ప్రభుత్వ ఆసుపత్రిలోపల్స్ పోలియో ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 3 :

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టినటువంటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని బాల్కొండ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ యూనుస్. కుందరపు శీను మైనార్టీ మండల్ అధ్యక్షుడు షేక్ జావీద్ సయ్యద్ రియాజుద్దీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఐదేళ్ల లోపు ఉన్న చిన్న పిల్లలందరికీ పల్స్ పోలియో వేయించే విధంగా చూడాలన్నారు. చిన్నపిల్లలకు పల్స్ పోలియో శ్రీరామ రక్షణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ సయ్యద్ శోహిద్దీన్. విక్కీ. పురుషోత్తం. అంగన్వాడి సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.