Tuesday , July 16 2024

బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లను, బాక్సులను పంపిణి చేసిన లయన్స్ క్లబ్

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 2 :

నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండల కేంద్రం లోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థులకుమోర్తాడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్ లను, బాక్సులను శనివారం సామాగ్రిని పంపిణి చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ సభ్యులైన గోపిడి సత్యనారాయణ, సామ శ్రీనివాస్ లు సుమారు 40 మంది విద్యార్థులకు జామెంటరీ బాక్స్ లతో పాటు ఎగ్జామ్ పాడ్స్ లను అందజేశారు. విద్యార్థులకు మెటీర్యాల్స్ అందజేయడం పై పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతాదృక్పధం తో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం ఛైర్మెన్ జక్కం నాగరాజు తో పాటు క్లబ్ అధ్యక్షులు మామిడాల మనోహర్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.