Monday , July 22 2024

పాలెం గ్రామం రైతు బిడ్డ జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు కెప్టెన్ సుశాంకు, ఘనంగా సన్మానం

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 28:

మోర్తాడ్ మండలం లోనిపాలెం గ్రామంలో జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సుశాంక్ కు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, పాలెం ప్రజాప్రతినిధులు ఘనంగా అభినందన, ఆత్మీయ సమ్మేళన సత్కారం ఈనెల 21 నుండి24వరకు మహారాష్ట్రలో జరిగిన కబడ్డీ పోటీలకు జాతీయ సీనియర్ తెలంగాణ కబడ్డీ జట్టు తరపున సుశాంక్ కెప్టెన్ గా వ్యవహరించడం జరిగింది. సుశాంకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కావడం గమనర్వం. ఈ సందర్భంగ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరపున జిల్లా కబడ్డీకార్యదర్శి అందాల లింగయ్య అధ్యక్షతన జరిగింది, పాలెం ప్రజాప్రతినిధుల, సమక్షంలో జాతీయ జిల్లా కబడ్డీ సీనియర్ జట్టు కెప్టెన్ గా సుశాంక్ వివరించిన నేపాధ్యంలో అభినందన ఆత్మీయ సత్కారం సభ సమావేశం నిర్వహించారు.. ఇ కార్యక్రమంలో.జిల్లా జిమ్నాస్టిక్ సంఘం అధ్యక్షులు సాయ గౌడ్ , సీనియర్ జాతీయ క్రీడాకారులు మచ్చేందర్ , జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ , కబడ్డీ జిల్లా కోచ్ మీసాల ప్రశాంత్ ,సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, ముప్కాల్ కే గంగాధర్ , శ్రావణ్ గారు,వేల్పూర్ సాయిరెడ్డి, వేంపల్లి పురుషోత్తం, వేల్పూర్, ముప్కాల్, నిజామాబాదు, పాలెం కబడ్డీ సీనియర్ క్రీడాకారులు, పి .ఈ .టి.లు గంగాధర్. సంజీవ్, నచ్చయ్య, ప్రమోద్, పాలెం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు మగ్గిడి శంకర్. ఎడ్ల సీరిల్ రావ్. గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు, పాలెం తాజాగ్రామ సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ పలిగిరిరవి, మండల వైస్ చైర్మన్ తోగేటి శ్రీనివాస్, పలువురు కబడ్డీ కెప్టెన్ గా వ్యవహరించిన సుశాంకును ఘనంగా సన్మానించి ,సత్కరించి, అభినందించారు .మరియు సన్మాన గ్రహీత తల్లిదండ్రులు. కుంట శ్రీనివాస్ రెడ్డి, సవిత, గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.