బయటకు తరలి వెళ్లకుండ, అధికారులు వెంటనే అక్రమ క్వారీనిసీజ్ చేయాలి
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 28
నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బంధువులు బంధువులు ఎలాంటి ప్రభుత్వ అధికారుల నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి గాని, ఫారెస్ట్ అధికారుల నుండి గాని, అన్ని డిపార్ట్మెంట్ నుండి గాని అనుమతులు పొందకుండా అక్రమంగా క్వారీని నడిపించి కోట్లాది రూపాయల అక్రమంగా సంపాదించి అక్రమాలకు పాల్పడ్డారని, వెంటనే బట్టాపూర్ అక్రమ ఆక్వారిని సీట్ చేయాలని బిజెపి అధ్యక్షులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి నాయకులు ఏ లిటి మల్లికార్జున రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బంధువులు అక్రమంగా కొనసాగిస్తున్న అక్రమ ఆ క్వారి పై నిత్యం పోరాటం చేసి, అక్రమ వారి వల్ల రైతులకు, ప్రజలకు నష్టం జరిగే విషయం ప్రజలకు వివరించి చైతన్యం చేసి, అక్రమ క్వారీనివెంటనే మూసివేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి సైతం స్పందించి బట్టాపూర్ అక్రమ క్వారీని వెంటనే సీజ్ చేయాలని, జిల్లా మైనింగ్ లేడీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్ అధికారులకు సైతం నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడంతో అధికారులు తీరుపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. రేపు, లేదా ఎల్లుండి ,రెండు రోజుల లోపు క్వారినుండి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, అధికారులకు తెలిసిన, తెలియని వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత, మైనింగ్, పొల్యూషన్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు మేల్కొని వెంటనే బట్టాపూర్ అక్రమ ఆక్వారీని, వెంటనే సీజ్ చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. నిన్నటివరకు డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి బి.ఆర్.ఎస్. పార్టీ లో చేరి మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అడ్డగోలుగా కాంట్రాక్టర్లు అక్రమాలు పనులు చేస్తూ బిల్లులు పొంది కోట్లాది రూపాయలు సంపాదించి, తీర కాంగ్రెస్ పార్టీలో చేరి, డి.సి.సి.బి చైర్మన్ గా పదవి చేపట్టి వాటిని కాపాడుకునేందుకు, అక్రమ వ్యాపారాలు కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారని,అ క్వారి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికైనా అక్రమ క్వారీని సీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున న్యాయం జరిగే వరకూ పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏర్గట్ల మండల బీజేవైఎం అధ్యక్షులు క్యాతం మైపాల్, మాజీ సర్పంచ్ తోకల నరసయ్య, ప్రసాద్, ఆనందం, గణేష్, అనిత, తదితరులు పాల్గొన్నారు.